మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మన ముందుకి వాల్తేరు వీరయ్య సినిమాతో రానున్నారు. టైటిల్ టీజర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య సినిమా ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన బాస్ పార్టీ పాట కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

పైగా ఈ సినిమా లో మాస్ మహారాజా రవితేజ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి, రవితేజ మళ్ళీ కలిసి నటిస్తున్నారు.

umair sandhu review about waltair veerayya trailer..

ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులకి చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మీద. ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి కి నార్త్ లో అంత క్రేజ్ లేదు. అయితే బాలీవుడ్ లో తన క్రేజ్ ని చూపించాలని అనుకునే ప్రతి సారి కూడా దెబ్బ తగులుతూనే ఉంది తప్ప అవకాశం రావడం లేదు. సల్మాన్ ఖాన్ తో దండయాత్ర చేసినా సరే ఉపయోగం లేకపోయింది. అయితే నార్త్ లో క్రేజ్ లేనప్పటికీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాని హిందీ లో తీసుకురానున్నారు పైగా నార్త్ లో విడుదల చేయాలని చిరంజీవి రవితేజ కలిసి ఉన్న పోస్టర్లని కూడా సిద్ధం చేశారు.

umair sandhu review about waltair veerayya trailer..

హిందీ డబ్బింగ్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాని తెలుగు తో పాటుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అయితే చిరంజీవికి అటువైపు అంత క్రేజీ లేక లేదు అయినప్పటికీ హిందీలో ఈ సినిమాని ఎందుకు విడుదల చేయబోతున్నారు అనే ప్రశ్న అందరిలో ఉంది. గాడ్ ఫాదర్, సైరా కూడా హిందీలో పెద్దగా ఆడలేదు. రవితేజ కి కూడా అంతా ఫ్యాన్ బేస్ అక్కడ లేదు. కానీ థియేటర్ల లో ఉత్తరాదిన ఈ సినిమా విడుదలైనప్పటికీ ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం లేదని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని హిందీలో తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. మరి చిరంజీవి రవితేజ ఎలా అక్కడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు అనేది చూడాల్సి ఉంది.