Ads
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఒడిదుడుకుల ప్రయాణంగా సాగుతోంది. హీరోగా ఓ రేంజ్ క్రేజ్ కూడగట్టుకున్న ఈ హీరో.. సరైన హిట్ పట్టలేకపోతున్నాడు. అర్జున్ రెడ్డి , గీతాగోవిందం తర్వాత అలా చెప్పుకోదగిన సినిమానే ఆయన ఖాతాలో పడలేదు. ఇంతలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రంగంలోకి దిగి లైగర్ సినిమాను రూపొందించడంతో ఈ సినిమా సక్సెస్ ఊహించని విధంగా ఉంటుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. విడుదల తర్వాత లైగర్ ఊహించని పరాజయం మూటగట్టుకుంది.
Video Advertisement
దీంతో విజయ్ దేవరకొండను హ్యాండిల్ చేసేందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్ రంగంలోకి దిగుతున్నారని.. ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు కమిట్ అయిన హరీశ్ శంకర్ ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ తన సినిమాలతో పాటు రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే దిల్ రాజు చొరవతో హరీష్ శంకర్- విజయ్ దేవరకొండ మీట్ జరిగిందని సమాచారం.
ఈ ఇద్దరి కాంబోలో సినిమా కోసం చర్చలు నడిచాయని.. దాదాపు ఇద్దరూ ఓకే అయ్యారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు.
కానీ అసలు విషయం ఏంటంటే..?ఇప్పటివరకు విజయ్ దేవరకొండకి హరీష్ కథ చెప్పలేదట. కథ చెప్పడానికి కొంత సమయం అడిగారట హరీష్ శంకర్. వారం లేదా పది రోజుల్లో ఒక మీటింగ్ ఉంటుందని సమాచారం. ఆ తరువాత ఈ కాంబో సెట్ అవుతుందో లేదో క్లారిటీ వచ్చేస్తుంది.
ఒకవేళ విజయ్ కి గనుక కథ నచ్చితే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ శంకర్.. మైత్రి సంస్థ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. అలానే ఈ సినిమాలో ‘జనగణమన’ నిర్మాతలు కూడా భాగమవుతారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఆగిపోయింది. దీంతో హరీశ్ శంకర్ ఇతర హీరోల వైపు చూస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రామ్ పోతినేనికి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు విజయ్ దేవరకొండపై కూడా ఫోకస్ పెట్టాడు.
End of Article