Ads
కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తం లో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
Video Advertisement
కేజీఎఫ్ కన్నడ సినిమా అయినా కూడా తెలుగులో చాలా పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా కోసం ఎలా అయితే ప్రేక్షకులు ఎదురు చూస్తారో కేజీఎఫ్ సినిమా కోసం కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే కేజీఎఫ్ – 2 సినిమా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. కెజిఎఫ్ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల అయిన తరువాత ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భూమిలో దాగి ఉన్న బంగారాన్ని తీయడం కోసం అక్కడి కార్మికులు పడే కష్టాలు.. ఆ బంగారు సామ్రాజ్యానికి అధిపతి అవ్వడం కోసం కొందరు చేసే ప్రయత్నాలను కూడా చూపించారు. తాజాగా ఈ సినిమా పార్ట్ 2 రిలీజ్ అయింది. అయితే.. వేల సంవత్సరాల క్రితం నుంచే కోలార్ బంగారు గనులు ఉన్నాయి.
బ్రిటిష్ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జాన్ వారెన్ కు కోలార్ మట్టిలో గోల్డ్ ఉన్నట్లు తెలిసింది. అక్కడి గ్రామస్తుల సహకారంతోనే మట్టి తవ్వకాలు ప్రారంభించారు. మట్టిలో తక్కువ బంగారమే ఉండడంతో ఆ ప్రయత్నాలను ఆపేసారు. 1850 వ సంవత్సరం లావెల్లి జాన్ టేలర్ అనే గవర్నర్ తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. ఇక్కడి బంగారు గనులు అంతరించి పోవడంతో 2001 వ సంవత్సరం నాటికి ఈ తవ్వకాలు పూర్తిగా ఆగిపోయాయి.
దీన్ని బేస్ గా తీసుకునే కెజిఎఫ్ సినిమా రూపొందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. కెజిఎఫ్ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా కథ పూర్తిగా కల్పితమని ఓ సందర్భంలో పేర్కొంది. కెజిఎఫ్ ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రికార్డు లు నమోదు చేసింది. తాజాగా.. విడుదల అయిన సెకండ్ పార్ట్ ఏ స్థాయిలో అలరిస్తుందో వేచి చూడాలి.
End of Article