Ads
కొన్నేళ్ల క్రితం సినీ వ్యాపారపరంగా చిన్న పరిశ్రమగా ముద్రపడ్డ కన్నడ చిత్రసీమ క్రమంగా తన పరిధుల్ని విస్తరించుకుంటున్నది. పాన్ ఇండియా కథాంశాలతో దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్నది. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు అందుకు నాంది పలికాయి. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ‘కాంతారా’ కన్నడనాట సంచలనాల్ని సృష్టిస్తున్నది.
Video Advertisement
సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా కాంతారా అదే హవా కొనసాగిస్తుంది.
అదే విధంగా మనమంతా, జనతాగ్యారేజ్ వచ్చిన తర్వాత మోహన్ లాల్ ఇక్కడ తెలుగులో కూడా ఫేమస్ అయ్యిపోయారు. దాంతో ఆయన హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి వదలటం మొదలైంది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా మళయాళంలోనూ దాదాపు 125 కోట్లు వసూలు చేసి అక్కడ పరిశ్రమలో బాహుబలిని దాటిన రికార్డ్ ని క్రియేట్ చేసిన పులి మురుగన్ ఒకెత్తు.
ఈ వయస్సులోనూ మోహన్ లాల్ చేసిన ఫైట్స్ కు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా పులితో తీసిన సీక్వెన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. డిఫరెంట్ బ్యాక్ డ్రాఫ్ తో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తే…అన్ని వర్గాలని ఆకట్టుకుంది.
అటవీ నేపథ్యం లో వచ్చిన ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ రెండిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. దాని గురించి ప్రస్తుతం నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ పాయింట్ ఏంటంటే.. ఈ రెండు చిత్రాల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా కిషోర్ కుమార్ ఏ నటించారు. రెండిటి లోను హీరో కి, కిషోర్ కుమార్ కి మధ్య పోరు జరుగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. దీంతో 2016 లో వచ్చిన మలయాళ చిత్రం మన్యం పులి కి, తాజాగా విడుదలైన కన్నడ చిత్రం కాంతారా కి ఈ కామన్ పాయింట్ చూసారా అంటూ సోషల్ మీడియా లో కామెంట్లు వెల్లు వెత్తుతున్నాయి.
End of Article