Ads
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో ఇంకో సినిమా ఓకే చేసారు. అయితే సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. ఇంతకు ముందు ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ తాజా చిత్రం ఈ నెల 24 నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. పూజ కు డేట్ కూడా ఫిక్స్ అయింది.
Video Advertisement
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో ఎన్టీఆర్ 30 సినిమా ని తెర మీద కి తీసుకు వస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కి మ్యూజిక్ ఇస్తున్నారు. అలానే ఎన్టీఆర్ 30కి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, వీడియోస్ ని బట్టి ఈ చిత్రం సముద్రం, పోర్ట్, స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది.
ఈ మూవీ లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తూ దర్శకుడు కొరటాల ఇంత సింపుల్ కథ రాసుకుంటారు అని అనుకుంటే తప్పే అవుతుంది. కచ్చితంగా ఇప్పటి వరకు టచ్ చేయని విషయాలు కచ్చితంగా ఉంటాయి. కొరటాల సినిమా కథ ఇలా వుంటుంది అని లీక్ లు రావడం ఇదేం కొత్త కాదు. ఆచార్య విషయంలో కూడా ముందుగా ఇలాగే లీకులు వచ్చాయి. కానీ తీరా సినిమా వచ్చాక అవన్నీ కరెక్ట్ కాదని తెలిసింది.
అందుకే ఈ సినిమా కథ ఎలా ఉంటుందో సినిమా సెట్ మీదకు వెళ్లాక అయినా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article