ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత ఎన్టీఆర్ క్రేజ్ మరెంత పెరిగింది. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్‌ 30 మీద అంచనాలు కూడా ఎక్కువ గానే వున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్నారు.

Video Advertisement

త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్ షురూ కానుంది. వీరిద్దరి కాంబో లో జనతా గ్యారేజ్‌ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది.

Reason behind NTR new look..

సో మళ్ళీ ఈ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. మరి ఏం అవుతుందో చూడాల్సి వుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెర‌కెక్కుతుంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ మూవీ కి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేసారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించనున్నారు. ఆమె కూడా చక్కటి నటన తో ఆకట్టుకునేలానే కనపడుతున్నారు. ఈ సినిమా కి జాన్వీ కపూర్ 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలానే ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్.

expensive things owned by junior NTR

ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ వెకేషన్ లో వున్నారు. అయితే సోషల్ మీడియా కి మాత్రం తారక్ దూరంగా వుంటున్నారు. ఫామిలీ పిక్స్ ని కూడా ఏమి షేర్ చెయ్యడం లేదు. ఫ్యామిలీ పిక్స్ వంటివి షేర్ చేయడం వల్ల నష్టమేనని అయన భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ బన్నీ, చరణ్ వంటి స్టార్ హీరోలు మాత్రం ఫామిలీ ఫొటోస్ ని షేర్ చేస్తూనే వుంటారు. అయితే ఇది వారి పర్సనల్. నచ్చితే వాళ్ళే షేర్ చేస్తారు.  మరి ఈ విషయంలో తారక్ చేస్తున్నది కరెక్ట్ ఏనా..?