బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో పవన్ తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ వచ్చాయి. అలాగే.. ఓజి సినిమా నుంచి కూడా గ్లిమ్ప్స్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా స్టోరీ గురించి కూడా ఓ వార్తా వైరల్ అవుతోంది.

Video Advertisement

పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రం ‘OG’ కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించిన వార్తలు కూడా ఓ రేంజ్ లో గుప్పుమంటున్నాయి. ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీని ప్రకారం, ఓ సామాన్య కుర్రాడు అనుకోకుండా ముంబై వచ్చి గ్యాంగ్ స్టర్ అవుతాడు. ఆ తరువాత అతను చాలా క్రైమ్స్, మాఫియా కేస్ లలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది.

ఈ క్రమంలో అతను తన ఫ్యామిలీని కూడా కోల్పోతాడు. తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి డ్రగ్స్ మాఫియా మొత్తాన్ని ఎలా అంతం చేస్తాడు? అన్న కథాంశంతో ఓజి రూపొందుతోంది అని టాక్. దీనిపై నెటిజన్స్ “రామ రామ కృష్ణ కృష్ణ” సినిమాలో అర్జున్ స్టోరీ లా ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ హీరోయిన్ కు బ్రదర్ గా నటించిన సంగతి తెలిసిందే.