ఇటీవల కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు రష్మిక మందన్న. 2020 మొదట్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ అవ్వగా, తర్వత భీష్మ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది.

కార్తీ తో సుల్తాన్ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ అనే వార్త వినిపిస్తోంది. అయితే రష్మిక కి ఒక అరుదైన గుర్తింపు లభించింది. ఒక సారి గూగుల్ లో “నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా (national crush of India) అని టైప్ చేసి చూడండి. అందులో రష్మిక పేరు చూపిస్తుంది.

 

ఇంకొక విషయం ఏంటంటే ఇది స్వయంగా గూగుల్ డిక్లేర్ చేసింది. రష్మిక తెలుగులో, కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు తమిళ్ లో కూడా నటిస్తున్నారు. కానీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్, చలో, ఇంకా కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేశారు.

అలా డబ్బింగ్ సినిమాల ద్వారా రష్మిక, హిందీ ప్రేక్షకులకి కూడా సుపరిచితులు అయ్యారు. దాంతో రష్మిక క్రేజ్ నార్త్ సైడ్ కూడా పాకింది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచుగా యాక్టివ్ గా ఉంటారు రష్మిక మందన్న. ఇంతకు ముందు ఈ గుర్తింపును మానుషి చిల్లర్, ప్రియా ప్రకాష్ వారియర్ సంపాదించారు. ఇప్పుడు ఈ జాబితాలో రష్మిక కూడా  నిలిచారు.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com