కమెడియన్ ఆలీ సినిమాల్లో నటించడం తగ్గించడానికి అసలు కారణం ఇదే..?

కమెడియన్ ఆలీ సినిమాల్లో నటించడం తగ్గించడానికి అసలు కారణం ఇదే..?

by Sunku Sravan

Ads

ఒకప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాలో అలీ క్యారెక్టర్ మాత్రం తప్పనిసరిగా ఉండేది. ఆలీ లేకుండా సినిమాలో వినోదం ఉండదని భావించేవారు. కానీ ప్రస్తుతం ఆలీకి సినిమాలో ఛాన్స్ తగ్గిందనే చెప్పవచ్చు. ఏం జరిగిందో ఏమోకానీ ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా సినిమాల్లో ఆలీ కనిపించడం లేదు. మరి ఎందుకు కనిపించడం లేదు అనే డౌట్ చాలామందిలో ఇప్పటికి ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని ఆలీ గారే ప్రస్తావిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా మంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ దీనిపై ఆయన ఏమన్నారంటే.. ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు.పాత్ర చాలా బాగుంటుంది అని చెబుతూ.. కథ ఏంటో కూడా చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్ లోకి వచ్చాక అసలు ఆలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు అనేలా మూవీస్ ఉన్నాయి. అభిమానులతో అలా అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వస్తున్నా కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అన్నారు. ఈటీవీ సీరియల్ లో నటించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం యమలీల సీరియల్ చేస్తున్నానని అన్నారు. స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశాడని, ఆయన ఏది చెప్పినా వెనకాడకుండా ఆలోచించకుండా చేస్తానని అన్నాడు ఆలీ. అందుకోసమే ఇప్పుడు యమలీల సీరియల్ చేశానని వివరించాడు. దీంతో పాటు ఇతర భాషల్లో సినీ అవకాశాల గురించి కూడా ఆలీ చెప్పుకొచ్చారు.తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే నేపాలి సినిమాకు కూడా సంతకం చేశారట. ఒకప్పుడు మన తెలుగులో ఉత్తరాది వాళ్లని తీసుకువచ్చి నటన, భాషను నేర్పించి మరి దర్శకనిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ వాళ్లే మనల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మేం ఇండియన్ స్టార్స్ గా మారిపోయామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే నేపాల్ సినిమా వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

Video Advertisement

 


End of Article

You may also like