నటుడు సుధాకర్ అందరికీ సుపరిచితమే. ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఇప్పటికి 600 సినిమాలకు పైగా నటించి బాగా పాపులర్ అయ్యాడు. తాను చేసిన కొన్ని పాత్రలు అయితే ఎప్పటికీ గుర్తుంది పోతాయి. ఈయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వులు మొహంపై కనిపించేవి. 90ల్లో దాదాపు ప్రతి సినిమాలో ఈ నటుడు ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో కదా.. అయితే అంత గొప్ప నటుడు ఎందుకు గత 20 ఏళ్లుగా స్క్రీన్ మీద కనిపించడం లేదు? సుధాకర్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం అనారోగ్య సమస్యలే అని అంటున్నా అసలు నిజం ఏమిటి అనేది బయటకి రావడం లేదు. ఇప్పుడు ఈ నటుడు మళ్ళీ నటించాలని, తెర మీద కనపడాలని అనుకుంటున్నా అవకాశాలు మాత్రం లేవు.

Video Advertisement

 

వీటి అన్నింటికీ కారణం ఏమిటి అనేది చూస్తే… నటుడు సుధాకర్ కెరీర్ కు ఏకంగా ఓ సినిమా స్టోరీ అంతే ఫ్లాష్ బ్యాక్ ఉందిట. ఎందరో దిగ్గజ స్టార్ లాగ ఉండాల్సిన సుధాకర్ సాదా సీదా నటుడిగానే మిగిలి పోయాడు. దానికి ఎన్నో పరిస్థితులు కారణం అయ్యాయి. 1977 సంవత్సరంలో సుధాకర్, చిరంజీవి ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఒకేసారి డిగ్రీ కూడా తీసుకుని బయటకి రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళం నుంచి సుధాకర్ కు ఆఫర్స్ కూడా రావడం మొదలయ్యాయి. దాంతో అక్కడికి వెళ్ళిపోయాడు ఈయన.

 

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ గుర్తున్నాడా.. స్టార్ హీరో అవ్వాల్సిన అతడిని తొక్కేసిందెవరో తెలుసా..?

 

మంచి విజయాలనే పొందాడు. కేవలం మూడేళ్లలో 40 తమిళ సినిమాల్లో హీరోగా నటించాడు. ఇంకేం వుంది తమిళ స్టార్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి వాళ్లు కూడా ఈయనని చూసి భయపడ్డారు. ఒక తెలుగు వాడు తమిళ గడ్డపైకి వచ్చి ఇంత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం నిజంగా గొప్ప విషయం. కానీ ఇది అక్కడ దర్శకులకి, నిర్మాతలకి నచ్చలేదు. ఇంకేం వుంది కేవలం మూడేళ్లలో 40 సినిమాలు చేసి సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న సుధాకర్ కెరీర్ ను తొక్కేశారు. కేవలం తెలుగువాడు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు.