Ads
సుమంత్‌తో మళ్ళీ రావా, నానితో జెర్సీ సినిమాలతో గౌతమ్ తిన్ననూరి సెన్సిబుల్ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. జెర్సీ మూవీకి అయితే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడట.
Video Advertisement
జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్‌తో సినిమా చేయాల్సి ఉంది. గౌతమ్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో అప్పట్లో గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ కాంబోలో మూవీ తెరకెక్కబోతుందని, ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నుంచి ప్రకటన కూడా వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా లేట్ అవడం, ఆ తర్వాత తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అవడంతో, గౌతమ్ సినిమాని పక్కన పెట్టేశాడు రామ్ చరణ్.
అయితే గౌతమ్ మాత్రం ఈ కథను వదల్లేదు. అటు నిర్మాత కూడా తగ్గలేదు. దీంతో నేరుగా ఈ ప్రాజెక్టు ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఓవైపు హరీశ్ శంకర్ తో చర్చలు జరుపుతున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు సైమల్టేనియస్ గా గౌతమ్ తిన్ననూరితో కూడా చర్చలు మొదలుపెట్టాడు.
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే “లైగర్” సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో “గీతగోవిందం” వంటి రొమాంటిక్ కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ కి గౌతమ్ తిన్నానూరి సరిగ్గా అలాంటి కదే చెప్పటంతో వెంటనే ఒప్పేసుకున్నారట.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువనుందని తెలుస్తోంది.
End of Article