ఆయన కారణంగానే… ఈ 2 సినిమాలు విజయం సాధించాయా..?

ఆయన కారణంగానే… ఈ 2 సినిమాలు విజయం సాధించాయా..?

by Mohana Priya

Ads

వైజయంతి మూవీస్ బ్యానర్ పై రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం సీతారామం. అశ్వినీదత్ చలసాని 1972లో స్థాపించిన ఈ సంస్థ బ్యానర్ పై కృష్ణుడు వేషంలో ఎన్టీ రామారావు శంఖం పూరించే చిత్రం ఎప్పటినుంచో ఉంది.

Video Advertisement

కానీ దీని వెనక చాలా ఆసక్తికరమైన కథ ఉంది…అదేమిటంటే తన పెట్టబోయే సంస్థ గురించి అశ్వినీ దత్ సీనియర్ ఎన్టీఆర్ గారి తో సంప్రదిస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు తన ఎదురుగా ఉన్న కృష్ణుడి ఫోటో చూపించి ” ఆ కృష్ణుడి మెడలో ఉన్న వైజయంతి మాలలాగా మీ సంస్థ ఎప్పుడు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను ,కాబట్టి నీ సంస్థ కు వైజయంతి అని పెట్టుకో” అని చెప్పారట.

మొదటి నుంచే ఎన్టీఆర్ గారంటే విపరీతమైన అభిమానం ఉన్న అశ్వినీ దత్ వెంటనే తన ప్రొడక్షన్స్ కు వైజయంతి మూవీస్ అని పేరు పెట్టడమే కాకుండా బ్యానర్ పైన కృష్ణుడి రూపంలో శంఖం పూరించే ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టడానికి నిర్ణయించుకున్నారు అని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అశ్వినీ దత్ కుమార్తె వెల్లడించారు. ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ అయిన బింబిసార మూవీ కూడా రికార్డ్స్ స్థాయిలో హిట్ గా నిలిచింది. నందమూరి కళ్యాణ్ రామ్ తన తాతగారైన ఎన్టీఆర్ జ్ఞాపకార్థం స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్టీఆర్ ఫోటోనే ఉంటుంది.

sita ramam movie review

ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్న రెండు హిట్ చిత్రాల బ్యానర్ల పై తమ అభిమాన నటుడు చిత్రాన్ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రెండు సినిమాలు థియేటర్లలో హిట్ టాక్ తో నడుస్తున్నాయి. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని అంటున్నారు. ఈ సినిమాల్లో ఒక సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అయితే మరొక సినిమా ప్రేమ కథ అవ్వడంతో ప్రేక్షకులు అందరూ కూడా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.


End of Article

You may also like