స్టార్ హీరో ఆఫర్ వద్దనుకొని ఇప్పుడు అగచాట్లు పడుతున్న హీరోయిన్..

స్టార్ హీరో ఆఫర్ వద్దనుకొని ఇప్పుడు అగచాట్లు పడుతున్న హీరోయిన్..

by Mounika Singaluri

ఇవానా .. సడన్గా ఈ పేరు గుర్తుకు రాకపోవచ్చు కానీ లవ్ కూడా హీరోయిన్ అంటే మాత్రం వెంటనే ఓ బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో మైండ్ లోకి గుర్తుకొస్తుంది కదా. ఆ అమ్మాయి పేరే ఇవానా.. ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఇండియాలో సెన్సేషన్ గా మారిన ఈ క్యూట్ గర్ల్ తర్వాత బాగా సైలెంట్ అయిపోయింది. తన వారసుడు ఆశిష్‌ హీరోగా దిల్ రాజ్ తన సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మూవీలో తప్ప మరింకే మూవీలో ఆఫర్ రాకపోవడంతో పాపం ఈ ముద్దుగుమ్మ సైడ్ లైన్లోకి వెళ్లిపోయింది.

Video Advertisement

మనం జీవితంలో అప్పుడప్పుడు గొప్ప అనుకుని చేసే చిన్న చిన్న తప్పుల ఫలితాలు కెరీర్ లో చాలా దూరం మనల్ని వెంటాడుతాయి.. ఈ ముద్దుగుమ్మ విషయంలో కూడా అదే జరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే .. వెతుక్కుంటూ వచ్చిన స్టార్ హీరో సినిమాని అప్పట్లో రిజెక్ట్ చేసింది. అదే కనుక జరగకుండా ఉంటే.. పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇంతకీ విషయం ఏమిటంటే ధోనీ ప్రొడక్షన్ లో ఇవానా..LGM సినిమా చేసింది. అదే టైంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి పక్కన నియోలాంటి చిత్రంలో నటించే బంపర్ ఆఫర్ వెతుక్కుంటూ ఈ బ్యూటీ దగ్గరకు వచ్చింది. అయితే ఆ క్యారెక్టర్ కి సినిమాలో పెద్ద లెంత్ లేదని.. విజయ్ కి చెల్లెలుగా చేయడం ఏంటి అని ఫీల్ అయ్యి.. ఆ ఆఫర్ ని వద్దనుకుందట. క్యారెక్టర్ చిన్నదైనా చిత్రంలో నటించి ఉంటే ఆఫర్లు మంచిగానే వచ్చేవి కదా అంటున్నారు నెటిజన్స్.. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది.


You may also like

Leave a Comment