జబర్దస్త్ కామెడి షో కమెడియన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా సెలెక్ట్ అయ్యారు. జబర్దస్త్ లో తనదైన పంచులతో అందరిని నవ్వించిన కమెడియన్ పిల్లలకు పాఠాలు చెప్పడానికి సిద్ధం  అవుతున్నారు.

Video Advertisement

బ్రహ్మానందం, సుకుమార్ లాంటివారు మొదట్లో ఉపాధ్యాయ వృత్తిలో కొన్నాళ్ళు కొనసాగిన తరువాత సినిమాల మీద ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. దీనికి భిన్నంగా ఒక యాక్టర్ సినిమాలలో నటిస్తూ, కామెడీ షోలో స్కిట్లు చేసి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారు.

అతనికి అవకాశాలు లేక టీచర్ గా కాలేదు.  గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పడం అతని 25 సంవత్సరాల కల. ఇన్నేళ్ళకి ఆయన కల నిజమైంది. తన కలను నిజం చేసుకున్న నటుడు ఎవరో కాదు, జబర్దస్త్ కమెడియన్ గణపతి.
Jabardasth-Ganapati-Masterశ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకి చెందిన గణపతి జబర్దస్త్ కామెడీ షోలో తనదైన హస్యంతో నవ్వించేవారు. గణపతి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన గణపతికి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేయడం కల. ఇప్పుడు అది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లుగా పని చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
Jabardasth-Ganapati-Master.jpg11998లో డీఎస్సీ రాసినవారిని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మార్చి  15న ఏపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1998లో డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా మీద నియమించింది. అలా ఎన్నికైన వారిలో జబర్దస్త్ యాక్టర్ గణపతి కూడా ఒకరు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన గణపతి ఆముదాలవలస మండలంలోని సంత కొత్తవలస అనే గ్రామంలో టీచర్ గా  జాయిన్ అయ్యారు. ఇన్నేళ్ళకు గవర్నమెంట్ టీచర్ కావాలనే తన కల నెరవేరిందని గణపతి ఆనందపడుతున్నారు.

Also Read: “3D సినిమా అని చెప్పి సీరియల్ చూపించారు ఏంటి..?” అంటూ… “శాకుంతలం” సినిమా రిలీజ్‌పై 15 ట్రోల్స్..!