బుల్లితెర పై ప్రసారం జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో, అందులో నటించే కామెడియన్స్ కూడా అంతే పాపులర్ అయ్యారు. అలా జబర్దస్త్ కమెడియన్స్ ప్రేక్షకులకి సుపరిచితమే. జబర్దస్త్ నటులలోతనదైన శైలిలో పంచుల వేస్తూ కమెడియన్ పంచ్ ప్రసాద్ గుర్తింపును సంపాదించుకున్నాడు.

Video Advertisement

పంచ్ ప్రసాద్ గత కొన్ని ఏళ్లుగా కిడ్నీ సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా పలు అనారోగ్య సమస్యలతో సత్యమతమవుతున్నాడన్న విషయం తెలిసిందే. చికిత్సలో భాగంగా పంచ్ ప్రసాద్ కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు.అయితే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నప్రసాద్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు.  ప్రస్తుతం పంచ్ ప్రసాద్ కండిషన్ సీరియస్ గా ఉందని సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తెలిపారు. వీలైనంత త్వరగాపంచ్ ప్రసాద్ సర్జరీ చేయాలని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని, అందు కోసం దాతలు ఎవరైనా సహాయం చేయాలని కోరాడు.పంచ్ ప్రసాద్ హెల్త్ కండిషన్ ను వివరిస్తూ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లోనే నూకరాజు ఒక వీడియో విడుదల చేశాడు. “ఎన్నో హాస్పటల్స్ తిరిగామని ప్రసాద్ అన్న హెల్త్ కండిషన్ లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. 3 ఏళ్ల క్రితమే 2 కిడ్నీలు ఫెయిలయినా, ఆ బాధను అప్పటి నుండి అలాగే భరిస్తున్నాడు. ఇక కిడ్నీ సమస్య ఉన్నవారికి జబ్బులు ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉంటాయని, ప్రసాద్ అన్నకు అలానే జరిగింది.
వైద్యులు వీలైనంత త్వరగా ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని, చేయించకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అన్నారు. ఈ ఆపరేషన్ కు ఖర్చు లక్షల్లో అవుతుంది. చేతులెత్తి ప్రార్ధిస్తున్నా దయ చేసి మీకు వీలైనంత సహాయం చేయండి” అని నూకరాజు అర్థించాడు. పంచ్‌ ప్రసాద్‌ ఈ వీడియోలో ముఖానికి ఆక్సిజన్‌ మాస్కుతో  కనిపించాడు.

Also Read: “కోట్లు పెట్టి సినిమా తీస్తే సరిపోదు… ఇవి కూడా చూసుకోలేరా..?” అంటూ… “ఆదిపురుష్” డైరెక్టర్‌పై కామెంట్స్ ఏం జరిగిందంటే..?