అమ్మాయిగా ఎందుకు మారారని జబర్దస్త్ పింకీని అడిగితే…ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా?

అమ్మాయిగా ఎందుకు మారారని జబర్దస్త్ పింకీని అడిగితే…ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా?

by Anudeep

Ads

జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో లేడీ గెటప్స్ ది ఒక ప్రత్యేక పాత్ర . అలాంటి కార్యక్రమంలో ఆడవాళ్లు యాక్ట్ చేయరనుకున్నారో , మరే కారణమో కానీ మొదట్లో జంట్సే లేడీ గెటప్స్ వేసి యాక్ట్ చేసేవాళ్లు. వాళ్లల్లో వినోద్ బాగా ఫేమస్ వినోదిని గా వినోద్ కి ఎంతో గుర్తింపు వచ్చింది. రాను రాను ధర్డ్ జెండర్ ఆ పాత్రల్ని సొంతం చేసుకున్నారు. వాళ్లల్లో ఒకరు సాయి అలియాస్ పింకీ.

Video Advertisement

టిక్ టాక్ లో సాయి వీడియోస్ ఎవరైనా చూస్తే అబ్బాయి అంటే నమ్మరు . ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి చూస్తే అమ్మాయిలైనా ముచ్చటపడ్తారు. తనే నేరుగా చెప్తే తప్ప నమ్మన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో సాయి పూర్తిగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయి అదిరింది షో లో వేణు వండర్స్ టీమ్ లో అదరగొడుతున్నాడు.

తాజాగా ఇచ్చిన  ఇంటర్వ్యూలో తానెందుకు ఆపరేషన్ చేయించుకున్న అంశంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.  తాను అమ్మాయిగా ఉండాలా? అబ్బాయిగా ఉండాలా అనేది పూర్తిగా తన వ్యక్తిగతం అని, దాని వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, అయినప్పటికి చాలా మంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఆపరేషన్ చేయించుకున్న మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను, అప్పుడు నా స్నేహితులే సాయం చేశారు. నడవలేని స్థితిలో కూడా స్నేహితులు అన్ని తామై చూసుకున్నారని చెప్పింది.

జబర్దస్త్ పింకీ

డబ్బు సంపాదించడం కోసమే అమ్మాయిగా మారానని అంటున్నారు, అమ్మాయిగా మారితే డబ్బులు వచ్చేస్తాయా?నిజానికి  అమ్మాయిలు నిలదొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికి తెలిసినదే కదా. ఇలాంటి కామెంట్స్ బాధపెడుతుంటాయి.ఎవరినైనా కామెంట్ చేసే ముందు నిజనిజాలు తెలుసుకుని కామెంట్ చేయండి అంటూ చెప్పింది.

షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల అవకాశాలు దక్కించుకుంది . తనకి వచ్చే అవకాశాల్లో పాత్రకి ప్రాధాన్యత ఉంటే చిన్నదా పెద్దదా చూడకుండా కచ్చితంగా నటిస్తానని అందులో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పుకొచ్చింది.

jaberdastha pinky

మళయాళి చిత్రం పెరంబు ఐడియా ఉందా మీకు, అందులో మమ్ముట్టి సరసన నటించిన అంజలీ అమీర్ హిజ్రానే, ఒక స్టార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సమాజం ఎంతో అభివృద్ది చెందుతుంటే మనలో కొందరు మాత్రం  ఇంకా వెనక్కి పోతున్నారు. కావాలంటే సాయి అలియాస్ పింకీ లాంటి వాళ్లని ఎంకరేజ్ చేద్దాం .అంతే తప్ప నెగటివ్ కామెంట్స్ చేసి బాధపెట్టడం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటి? ఆలోచించండి.


End of Article

You may also like