తెలుగు ఇండస్ట్రీలో ఈ ముగ్గురు మంచి స్టార్లుగా పేరుపొందిన నటులు. అయితే వీరు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు, జగపతి ఆర్ట్స్ అధినేత నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా జగపతిబాబు, అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఈ ముగ్గురు నట వారసులు హిందీలో విజయవంతమైన సినిమాలు తెలుగులో రీమేక్ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

మరి మీరు యాదృచ్చికంగా దర్శకుడు మధుసూదన్ రావు చేతుల మీదుగానే హీరోలుగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇందులో జగపతిబాబు మరియు నాగార్జున స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు.

ఈ తరుణంలో రమేష్ బాబు కూడా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అంతగా రాణించలేక పోయారు. కానీ ఆయన హఠాత్ మరణం చెందారు. నాగేశ్వరరావు హీరోగా సుడిగుండాలు, వెలుగునీడలు మూవీస్ లో బాలనటుడిగా చేసిన నాగార్జున దీని తర్వాత హిందీ లో జాకీ ష్రాప్, మరియు మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ డైరెక్షన్లో మూవీ రీమేక్ గా 1986 లో విక్రమ్ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా విజయవంతం అయింది. ఇకపోతే బాలనటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అనుభవం రమేష్ బాబుకు ఉంది.

ఈ తరుణంలో 23 సంవత్సరాల వయసులో సామ్రాట్ మూవీ తో హీరోగా అడుగు పెట్టాడు. కానీ అప్పటికే కృష్ణ మరియు ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఇది హిందీలో సన్నీ డియోల్ హీరోగా సూపర్ హిట్ సినిమా బేతా బ్ తెలుగులో రీమేక్ సామ్రాట్ పేరుతో వచ్చినది.. ఈ మూవీకి ఎస్వి రాజేంద్ర సింగ్ మొదటిసారి షెడ్యూల్ డైరెక్షన్ చేశారు. చాలా డబ్బు ఖర్చు అవుతున్నది షూటింగ్ అనేది ముందుకు సాగకపోవడంతో, సీనియర్ డైరెక్టర్ అయినా మధుసూదన్ రావుని మళ్లీ తీసుకున్నారు.

ఈ విధంగా ఆయన చేసిన తొలి మూవీ విజయవంతమైంది. అలాగే జగపతి బాబు కత్రోమ్ కే కిలాడీ సినిమాకు రీమేక్ గా సింహ స్వప్నం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు, దీన్ని కూడా మధుసూదన్రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు తండ్రిగా కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో జగపతిబాబు ద్విపాత్రాభినయం చేసిన కానీ మూవీ హిట్ అవలేదు.