జై భీం.. రియల్ లైఫ్ సినతల్లి స్టోరీ తెలుసా..? ఆ కేసు గెలిచాక కూడా ఎన్ని ఇబ్బందులు పడిందంటే..?

జై భీం.. రియల్ లైఫ్ సినతల్లి స్టోరీ తెలుసా..? ఆ కేసు గెలిచాక కూడా ఎన్ని ఇబ్బందులు పడిందంటే..?

by Anudeep

Ads

2021 లో ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, గత సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

Video Advertisement

ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తరువాత సినతల్లి గురించి అందరికి తెలిసింది. ఆమె పడ్డ కష్టాల గురించి తెలుసుకుంటే కళ్ళు చెమరుస్తున్నాయి.

sinatalli 4

జై భీమ్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సంగతి తెలిసిందే. సినతల్లి పాత్ర రియల్ లైఫ్ లో కూడా ఉంది. ఆమె పేరు పార్వతి అమ్మాళ్. రాజకన్ను భార్య ఆమె. తప్పుడు కేసు వలన ఆమె భర్త మృతి చెందాడు. అయితే.. ఈ కేసు కోర్టులో చాలా రోజుల విచారణ తరువాత న్యాయమైన తీర్పు లభించింది. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సినతల్లికి ఇల్లు కట్టించాల్సి ఉంది. మరి ఆమెకు ఇల్లు కట్టివ్వలేదా? ఆమె ఇలాంటి దుర్భరమైన వాతావరణం లో ఎందుకు నివాసం ఉండాల్సి వచ్చింది? అనే విషయాలను గుర్రం సీతారాములు ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ఆ వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

sinatalli 3

నిజంగా జరిగిన స్టోరీకి, పార్వతి గాధకి కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి వారు గిరిజనులు కాదు దళితులు. ఈ దుర్ఘటన జరిగేటప్పటికే ఆమెకు నలుగురు పిల్లలు పుట్టారట. లాక్ అప్ డెత్ లో రాజన్న చనిపోయాడన్న విషయం కూడా ముందే తెలుసట. ఈ దుర్ఘటన టైం లో ఆమె భర్తతో పాటు.. ఆమెను కూడా చాలా గట్టిగ కొట్టారట. ఆ దెబ్బలు ఇప్పటికి కూడా బాధపెడుతున్నాయని ఆమె విలపిస్తోంది.

sinatalli 2

ఈ దుర్ఘటన జరిగే టైం కి ఒక కొడుక్కి పది సంవత్సరాల వయసు ఉందట. ఆ పిల్లాడిని కూడా పోలీసులు గట్టిగా కొట్టారట. ఆ దెబ్బలకి ఆ పిల్లాడు పిచ్చి వాడు అయిపోయాడట. ఈ కేసు లో గెలిచాక నష్టపరిహారం కింద ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చారట. ఆమెకు ఇచ్చిన ఇల్లు వరదల్లోనే కొట్టుకుపోయింది. ఆ తరువాత ఆమె వేదన చెప్పనలవికాదు. ఆ వేదన విన్నవారు లేరు. తిరిగి ఇల్లు కట్టుకోలేక ఓ పాడుపడ్డ టార్పాలిన్ గుడిసెలో రెండు వేల రూపాయలకు అద్దె ఇస్తూ కాలం గడుపుతోంది.

sinatalli 5

పోలీసులు పెట్టిన టార్చర్ తో రాజన్న రెండవ రోజే చనిపోయాడు. ఆరోజు రాత్రికే శవాన్ని మాయం చేసేసారట. రాజన్న చనిపోయిన మూడవరోజుకి ఆ సొమ్ము రికవర్ అయిపోయిందట. ఎవరో ఓ ఆడ మనిషి ఆ దొంగతనం చేశారట. కానీ.. ఆమెను మాత్రం ఎవరు ఏమి అనలేదట. ఈ కేసు విషయంలో గోవింద్ అనే ఓ వ్యక్తి సాయం చేసాడట. లాయర్ చంద్రు కంటే సదరు వ్యక్తే ఎక్కువ సాయం చేసాడని పార్వతి చెబుతోంది. ఈ కేసు అయ్యేవరకు సదరు వ్యక్తి పెళ్లి కూడా చేసుకోలేదట. రాజన్న తో పాటు మరో ముగ్గురికి కూడా శిక్ష పడింది. వారిలో ఒకరు చనిపోగా… మరో ఇద్దరు పెన్షన్ తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.


End of Article

You may also like