Ads
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జైలర్ సక్సెస్ రజనీకాంత్ స్టార్ డమ్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన పదమూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
Video Advertisement
ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని గురించి ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాట్లాడుతూ ఈ మూవీలో రజినికాంత్ చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సంబంధించినదే అని అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సినిమా ‘జైలర్’. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయ్యి, తమిళంలోనే కాకుండా తెలుగులోనూ రజనీకాంత్ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందించారు. జైలర్ మూవీతో రజనీకాంత్ చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. దీంతో ‘తలైవా ఈజ్ బ్యాక్’ అని రజనీ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
అయితే ఈ మూవీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ గాంధీ మాట్లాడుతూ రజినికాంత్ ఈ మూవీలో చెప్పిన డైలాగ్ ఆయన జీవితానికి సంబంధించినదే అని చెప్పారు. క్లైమాక్స్ సీన్‌లో రజిని తన కుమారుడితో ఏదైనా చెప్పాలని ఉందా నాన్న? అంటూ పదేపదే అడిగే సీన్ ఉంటుంది. ఆ సమయంలో రజినికాంత్ రియల్ లైఫ్ లో బాధను చూపిస్తుందని అన్నారు. ఇది డైలాగ్ మాత్రమే కాదు.
ఆయన జీవితం అని ఆ డైలాగ్ చెప్పే సమయంలో రజనీకాంత్ కి కుమార్తె ఐశ్వర్య మరియు ధనుష్ గుర్తుకు వచ్చి ఉంటారని అన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు రాత్రికి రాత్రే తీసుకున్న డిసిషన్ కాదు. దీని గురించి రజనీ తన కుమార్తెను నేరుగా అడగలేరు. అందువల్ల ఆయన ‘ఈ నాన్నగారితో ఏదైనా చెప్పాలా అంటూ ఐశ్వర్యను చాలాసార్లు అడిగారు’ అంటూ ప్రవీణ్ గాంధీ వెల్లడించారు.
End of Article