Ads
- వెబ్ సిరీస్ : జల్లికట్టు
- నటీనటులు : కిశోర్, కలైయరసన్, షీలా రాజ్ కుమార్, వేల రామమూర్తి, ఆంటోనీ, బాల హాసన్ తదితరులు
- నిర్మాత : వెట్రిమారన్
- దర్శకత్వం : రాజ్ కుమార్
- ఓటీటీ వేదిక : ఆహా తెలుగు
- ఎపిసోడ్స్ : 8
- విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2023
Video Advertisement
కథ:
తమిళనాడులోని ముల్లయ్యూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తమిళనాడులో తామర కులానికి చెందిన ప్రజలకు, పశుసంపద జీవనాధారంగా బతుకున్న వ్యవసాయ కూలీల వర్గానికి తరాలుగా శత్రుత్వం ఉంది. అందువల్ల, జల్లికట్టులో తామర కులానికి చెందిన ఎద్దులను ఎవరూ పట్టుకోకూడదని వ్యవసాయ కూలీల పెద్దలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ ముత్తయ్య (కిశోర్) మేనల్లుడు పాండు (కలైయారసన్) తామర కులానికి చెందిన జమీందార్ సెల్వ శేఖరన్ (వేల రామమూర్తి) ఎద్దును పట్టుకుంటాడు. ఆ తర్వాత పాండి హత్యకు గురవుతాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ తామర కులం జల్లికట్టులో దింపిన ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించిన స్టాండప్ కమెడియన్ పార్తీబన్ (ఆంటోనీ) ఎవరు? ప్రతి జల్లికట్టులో ఎవరికీ లొంగని ఎద్దు (వేట కాళీ) అతనికి ఎలా లొంగింది..? వంటి చాలా ప్రశ్నలకు సమాధానం సిరీస్ చూసి తెలుసుకోవాలి.
రివ్యూ:
జల్లికట్టు సంప్రదాయం గురించి తెలుగు ప్రజలకు కూడా అవగాహన ఉంది. రెండు వర్గాల మధ్య ఆ సంప్రదాయం ఎటువంటి వైరానికి దారి తీసింది? ప్రేమ ఎంత పని చేసింది? అగ్ర వర్ణాల చేతిలో కూలీలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు? అనే అంశాలను మేళవించి ‘జల్లికట్టు’ సిరీస్ తీశారు.
ఈ సిరీస్ లో కథ, కథనాలు వెట్రిమారన్ శైలిలో సాగాయి. ఆయన సినిమాల్లో మనకు కనిపించే అంశాలు ఇందులోనూ ఉన్నాయి. పూర్తిగా తమిళ నేటివిటీతో సాగే సిరీస్ ఇది. వెబ్ సిరీస్ కావడంతో దర్శకుడు రాజ్ కుమార్ మరింత నెమ్మదిగా తీశారు.అగ్ర వర్ణాల అహంకార పూరిత ధోరణి, అధికార దర్పం, పేరు ప్రతిష్ఠల కోసం చేసే పోరాటంలో బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు? అనేది కథాంశం.
‘జల్లికట్టు’ నేపథ్యం ఈ కథకు కొత్త హంగులు, రంగులు అద్దింది. ఆర్టిస్టుల ఇంటెన్స్ యాక్టింగ్, టేకింగ్ కారణంగా సిరీస్ కొత్తగా కనబడుతుంది. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. కొన్ని సీన్లు థ్రిల్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సిరీస్ థీమ్ రిఫ్లెక్ట్ చేసేలా ఉన్నాయి.
కిశోర్ మినహా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు తక్కువ. ముత్తయ్య పాత్రలో కిశోర్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పాండు పాత్రలో కలైయరసన్ జీవించారు. తేన్ మౌళి పాత్రలో షీలా రాజశేఖర్ నటన బావుంది. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఆర్. వేల్‌రాజ్ కెమెరా పనితనం బాగుంది, జల్లికట్టు క్రీడను వివిధ కోణాలలో ఆకట్టుకునేలా చూపించారు. ప్రతాప్ సౌండ్ డిజైన్ బాగుంది, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే, ఎడిటింగ్ టీమ్ వారు సిరీస్‌ను కొంత ట్రిమ్ చేసి ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా ఆకట్టుకుంటుంది.
దర్శకుడు ఎల్ .రాజ్‌కుమార్ విషయానికి వస్తే, అతను సిరీస్ ని తెరకెక్కించడంలో ఓకే అనిపించారు. ఆయనే రచయిత కూడా కావడంతో అధికారం కోసం దురాశ, ప్రేమ మరియు ప్రతీకారం వంటి విభిన్న అంశాలను జల్లికట్టు క్రీడకు బాగా అనుసంధించారు.
ప్లస్ పాయింట్స్:
- సినిమాటోగ్రఫీ
- నటీనటులు
- కథ
మైనస్ పాయింట్స్
- స్లో నెరేషన్
- ఇంట్రెస్టింగ్ గా లేని కొన్ని సీన్స్
రేటింగ్ : 2 .5 /5
టాగ్ లైన్ :
తమిళ కల్చర్, నేటివిటీ తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచే ప్రేక్షకులను ఆకట్టుకునే వెబ్ సిరీస్ ‘జల్లికట్టు’.
End of Article