Ads
నితిన్ నటించిన ‘ద్రోణ’ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సూపర్ హిట్ సింగ్స్ కంపోస్ చేస్తూ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Video Advertisement
జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. తాను మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా అభిమానిస్తారో రామ్ చరణ్ పై కూడా అదే స్థాయిలో అభిమానాన్ని కురిపిస్తారు.
ఇప్పటికే చాలా మెగా హీరోల సినిమాలకు ఈయన సూపర్త హిట్ సాంగ్స్ ను అందించారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు చేసిన సహాయ సహకారాల గురించి జానీ మాస్టర్ ఇదివరకు ఎన్నో సార్లు చెప్పారు.
తాజాగా మరో సరి మెగా పవర్ స్టార్ తనకు ఎలా సహాయం చేశాడన్న దాని గురించి ఒక డాన్స్ షో లో మరో సారి ప్రస్తావించారు జానీ మాస్టర్. తాను ఇండస్ట్రీ లో ఎలా ఎదిగారు అన్న విషయాల గురించి చెప్తూ ఒక కంటెస్టెంట్ డాన్స్ పెరఫార్మ్ చేసారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా జానీ మాస్టర్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆమె తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొందని అదే సమయంలో జానీ మాస్టర్ రామ్ చరణ్ గారి సహాయం కోసం ఫోన్ చేయగా ఆయన మౌనవ్రతంలో ఉన్నారని మేనేజర్ చెప్పారు.
రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని చేరవేయాల్సిన చోటికి చేరవేశారు. విషయం తెలియని జానీ మాస్టర్ తనకు సహాయం చేసే వారు ఎవరూ లేరని ఎంతో కుమిలిపోయారు అయితే హాస్పిటల్లో వైద్యులు తన భార్యకు సర్జరీ చేసి తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా కాపాడారు. అయితే బిల్లు కట్టే సమయంలో కేవలం 350 బిల్లు మాత్రమే కట్టమని అక్కడ వైద్య సిబ్బంది చెప్పడంతో జానీ మాస్టర్ ఆశ్చర్యపోయారు..
అప్పటికే హాస్పిటల్స్ సిబ్బందికి ఉపాసన హాస్పిటల్ బిల్ మొత్తం పే చేశారని తెలిసింది.రామ్ చరణ్ ఎలాంటి పరిస్థితులలో ఉన్న తన సహాయం కోసం వచ్చే వారిని నిరాశగా వెనక్కి పంపించారని ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారంటూ ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన విషయంలో రామ్ చరణ్ ఉపాసన చేసిన సహాయాన్ని ఈ విధంగా పర్ఫామెన్స్ చేసి చూపిస్తూ మరోసారి రాంచరణ్ మంచి మనసు గురించి బయట పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ వల్లనే తాను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను.. తన కెరీర్ పరంగా , వ్యక్తిగతం గా కూడా ఎంతో సహాయం చేసింది రామ్ చరణ్ గారేనని, పలు సందర్భాల్లో ఆయన తమకు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు.
End of Article