అలనాటి అందాల తార శ్రీదేవీ గారాలపట్టి జాన్వీ కపూర్. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టం కొద్దీ జాన్వీ తొలి చిత్రం విడుదలయ్యే సమయానికి శ్రీదేవి తుది. అందంతో పాటు అభినయంలోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో బిజీ గా ఉంది జాన్వీ.

 

బాలీవుడ్ లో రాణించడం కోసం ఇటీవల జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ పెంచేంసింది. అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ లు చేస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. జాన్వీ క్రమం తప్పకుండా జిమ్ లో కసరత్తులు చేస్తూ ఫిజిక్ ని మైంటైన్ చేస్తోంది. జిమ్ కి వెళ్లే సమయంలో ఆమె ధరించే పొట్టి బట్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు జాన్వీ పై అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆమె సినిమా గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు అంటూ ఆమె ఫీల్ అవుతుంది.

 

జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్ మరింత రచ్చగా మారింది. జాలిలాంటి దుస్తులను ధరించడంతో అంతా ఫ్రీ షోలా బయటికి కనిపించింది. అయితే అలా అంటున్నవారిని తానూ తప్పు పట్టట్లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇకముందు తన నటన గురించి మాట్లాడుకుంటారని ఆశిస్తున్నా అని తెలిపింది జాన్వీ.

 

‘ధడక్‌’ చిత్రంతో కథానాయిక అయిన జాన్వీ వరుసగా సినిమాలు సైన్‌ చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక పక్క ఫిజిక్ మైంటైన్ చేయడమే కాదు…మరో పక్క సోదరితో, తండ్రితో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. షూటింగ్‌లకైతే సెలవు చెప్పారు కానీ వ్యాయామాలకు మాత్రం ‘నో హాలిడే’ అన్నారు జాన్వీ. వెకేషన్ లో కూడా వర్క్ అవుట్ చేస్తూనే ఉన్నారు. తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’లో టైటిల్‌ రోల్‌ చేశారు జాన్వీ. దోస్తానా 2 లో కూడా నటిస్తున్నారు. తన తల్లి లాగే జాన్వీ కూడా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాము.

 


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com