జాన్వీ కపూర్ కి బిగ్ షాక్.. షూటింగ్ క్యాన్సిల్.. !

జాన్వీ కపూర్ కి బిగ్ షాక్.. షూటింగ్ క్యాన్సిల్.. !

by Anudeep

Ads

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె నటిస్తున్న సినిమా షూట్ కి రైతుల ఉద్యమం కారణంగా అంతరాయం కలిగింది. ఇప్పటికే, పలు సినిమాల షూటింగ్ కి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కారణం గా పలు సినిమా యూనిట్ లు షూటింగ్ లను వాయిదా వేసుకుంటున్నాయి.

Video Advertisement

janvi 1

జాన్వీ కపూర్ సినిమా కి కూడా ఈ ఎఫెక్ట్ భారీ గానే పడింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ నయనతార సినిమా రీమేక్ అయిన “గుడ్ లక్ జెర్రీ” సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా నయనతార “కలమావు కోకిల” సినిమా కి రీమేక్. సిద్ధార్థ్ సేన్ గుప్తా ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. పంకజ్ మట్టా ఈ సినిమా కి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నీరజ్ సూద్, దీపక్, సుశాంత్ సింగ్ తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు.

janvi 2

పంజాబ్ రాష్ట్రము లో పాటియాలతో పాటు గా పలు ప్రదేశాల్లో ఈ సినిమా షూట్ ని జరుపుతోంది. రైతు సంఘాలు తమ ఆందోళలనలు పూర్తి అయ్యే వరకు ఎలాంటి షూటింగ్ లు పెట్టుకోవద్దని కోరడం తో జాన్వీ వెనుదిరిగింది. గతం లో కూడా రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ జాన్వీ కపూర్ షూటింగ్ ని వాయిదా వేసింది. తాజాగా, మరోసారి ఆమె షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఫలితం గా ఆమె ముంబై కి తిరిగి వచ్చేసింది. ఆ సమయం లో ఎయిర్ పోర్ట్ వద్ద ఆమె మీడియా కి చిక్కింది.

 


End of Article

You may also like