గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ కావడంతో జాతిరత్నాలు విడుదల అయ్యే ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది.

ఇంక టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మార్చి 11వ తేదీన విడుదలైన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా కొత్త కొత్త ఐడియాస్ తో చాలా డిఫరెంట్ గా చేశారు.

Jathi ratnalu movie in a nutshell

ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడంతో పాటు యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో కూడా కొత్త ప్రమోషన్ కాన్సెప్ట్స్ తో ఎంటర్టైన్ చేశారు జాతిరత్నాలు సినిమా టీం. అయితే ఈ సినిమాకి చిట్టి పాట కూడా చాలా పెద్ద హైలెట్ గా నిలిచింది. రథన్ స్వరపరిచిన ఈ పాటని రామ్ మిరియాల పాడారు.

Jathi ratnalu movie in a nutshell

ఈ పాట విడుదలైన కొంచెం సేపటికే సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యింది. అయితే మన సినిమాల్లో కొన్ని సీన్స్ ని కలిపి చిట్టి పాట లిరిక్స్ కి సింక్ అయ్యేలా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క సినిమాలోని సందర్భం సింక్ అయ్యేలా ఈ వీడియో రూపొందించారు. ఈ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.

watch video :