Ads
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాతో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. అసలు జాతిరత్నాలు సినిమా 2020 లోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ సినిమాలో పాటలు కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా చిట్టి పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి థియేటర్స్ లో ఎంతో మంచి స్పందన లభించింది. అయితే సినిమా అన్న తర్వాత పొరపాటు జరగడం అనేది సహజం. కాబట్టి జాతి రత్నాలు సినిమాలో కూడా అలానే కొన్ని పొరపాట్లు జరిగాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
జాతి రత్నాలు సినిమాలో టిఫిన్ సెంటర్ దగ్గర హీరోయిన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే హీరో వెళ్లి పలకరిస్తారు. అప్పుడు హీరోయిన్ వెనక్కి తిరిగి హీరో వైపు చూస్తారు. మామూలుగా ఫోన్ మాట్లాడుతుంటే మనం ఫోన్ స్ట్రైట్ గానే పట్టుకుంటాం.
హీరోయిన్ కూడా ముందు ఫోన్ మామూలుగా మాట్లాడుతున్నట్టు మనకి చూపిస్తారు కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత్రం హీరోయిన్ చేతిలో ఉన్న ఫోన్ రివర్స్ లో పట్టుకున్నట్టు ఉంటుంది.
అలాగే చాణక్య పాత్ర పై దాడి జరిగినప్పుడు రాహుల్ రామకృష్ణ కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ రాహుల్ రామకృష్ణ గర్ల్ ఫ్రెండ్ సువర్ణ నుండి వస్తుంది. అప్పుడు రాహుల్ రామకృష్ణ ఫోన్ లో చూస్తే ఆరోజు డేట్ సెప్టెంబర్ 6వ తేదీ అలాగే బుధవారం అని ఉంటుంది.
ఈ విషయంపై నెక్స్ట్ డే పేపర్లో వచ్చినప్పుడు మాత్రం శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే చాణక్య పై దాడి జరిగింది అని ఇస్తారు. ఇవే కాకుండా ఈ సినిమాలో ఇంకా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
watch video :
https://www.youtube.com/watch?v=CuOg9J-EiS8
End of Article