“పైట జార్చే సీన్ చేయను అన్నాను..! అప్పుడు మోహన్ బాబు..?” అంటూ… నటి “జయలక్ష్మి” కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

“పైట జార్చే సీన్ చేయను అన్నాను..! అప్పుడు మోహన్ బాబు..?” అంటూ… నటి “జయలక్ష్మి” కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి పేరు సంపాదించుకున్నారు జయలక్ష్మి. ఇటీవల కొంత కాలం నుండి జయలక్ష్మి అప్పుడప్పుడు మాత్రమే సినిమాలలో కనిపిస్తున్నారు. కొన్ని షోస్ లో కూడా కనిపిస్తున్నారు.

Video Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జయలక్ష్మి, తాను అప్పుడప్పుడు తన కూతురి దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటాను అని చెప్పారు. తన కూతురు విదేశాల్లో ఉంటారు అని చెప్పారు. తనకి సీరియల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అని అన్నారు. కానీ ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే మాత్రమే తాను సినిమాలు చేస్తాను అని అన్నారు.

jayalakshmi mohan babu incident 1

అయితే ఈ సందర్భంగా, మోహన్ బాబుతో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు జయలక్ష్మి. దాసరి నారాయణరావు గారి భార్య అయిన దాసరి పద్మ గారు జయలక్ష్మికి చాలా సన్నిహితురాలు. ఒకసారి మోహన్ బాబు వచ్చినప్పుడు, దాసరి పద్మ గారు జయలక్ష్మిని పరిచయం చేసి తన నెక్స్ట్ సినిమాలో ఏదైనా పాత్ర ఇవ్వమని చెప్పారు. వెంటనే మోహన్ బాబు జయలక్ష్మి కి కాల్ చేశారు. సినిమాలో తన పాత్ర ఒక ఐఏఎస్ భార్య పాత్ర అని చెప్పారు.

jayalakshmi mohan babu incident

అంతా బానే ఉంది అనుకున్న తర్వాత ఆమె పాత్ర పైట జారిపోతూ ఉంటే సరి చేసుకుంటూ ఉండాలి అని, అది ఒక మేనరిజం అని చెప్పారు. దాంతో జయలక్ష్మి ఇబ్బంది పడి ఆ పాత్ర చేయను అని కో డైరెక్టర్ తో చెప్పారు. ఇదంతా వింటూ ఉన్న మోహన్ బాబు కో డైరెక్టర్ ని పిలిచి ఏం జరిగింది అని అడిగితే అసలు విషయం చెప్పారు. అప్పుడు మోహన్ బాబు ఆ సీన్ ఎలా చేయాలి అనేది చూపించారు.

mohan-babu

అయినా కూడా చేయలేను అని జయలక్ష్మి చెప్పటంతో, కొంత సేపు బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత మరొక నటిని పిలిచి, అప్పుడు జయలక్ష్మిని మోహన్ బాబు పిలిచి, “అమ్మా మీరు వెళ్ళండి” అని చెప్పారు. “సాధారణంగా మోహన్ బాబు చాలా పెద్ద ఆర్టిస్ట్. షూట్ మధ్యలో ఇలాంటి జరిగినప్పుడు ఎవరైనా కోప్పడతారు. కానీ నా మీద కోప్పడలేదు. ఒక మాట కూడా అనలేదు. అందరూ, “ఏమీ అనలేదు ఏంటి?” అన్నారు. అందుకు కారణం దాసరి పద్మ గారు. మోహన్ బాబు కూడా చాలా మంచి వ్యక్తి. ఇప్పటికి కూడా ఎక్కడైనా కలిసినప్పుడు పలకరిస్తూ ఉంటారు” అని చెప్పారు.

watch video :

ALSO READ : 12 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి ఇప్పుడు క్షమాపణలు చెప్పిన “ధన్య బాలకృష్ణ”..ఒకప్పటి ఆ ఫేస్ బుక్ పోస్ట్ లో ఏముంది.?


End of Article

You may also like