12 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి ఇప్పుడు క్షమాపణలు చెప్పిన “ధన్య బాలకృష్ణ”..ఒకప్పటి ఆ ఫేస్ బుక్ పోస్ట్ లో ఏముంది.?

12 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి ఇప్పుడు క్షమాపణలు చెప్పిన “ధన్య బాలకృష్ణ”..ఒకప్పటి ఆ ఫేస్ బుక్ పోస్ట్ లో ఏముంది.?

by Mohana Priya

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి, కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి పేరు సంపాదించుకున్నారు ధన్య బాలకృష్ణ. అయితే ధన్య దాదాపు 12 సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

Video Advertisement

అందులో చెన్నై గురించి ధన్య రాశారు. ఆ పోస్ట్ లో ధన్య, “ప్రియమైన చెన్నై, మీరు నీళ్ల కోసం అడుక్కున్నారు. మేము ఇచ్చాము. మీరు కరెంటు కోసం అడుక్కున్నారు. మేము ఇచ్చాము. ఇప్పుడు మీరు మా ప్రాంతానికి వచ్చి మా నగరాన్ని ఆక్రమించారు.”

dhanya balakrishnan new post..!!

“ఇప్పుడు మేము దయతలిస్తే మీరు ప్లే ఆఫ్స్ కి వెళ్లారు. ఇలా మీరు ప్రతిదీ ఆడుకుంటున్నారు. మేము ఇస్తున్నాము. మీకు సిగ్గు లేదా?” అని అర్థం వచ్చేలాగా ఆ పోస్ట్ ఉంది. అయితే అప్పటి నుండి ధన్య ఈ విషయం మీద ఎన్నో కామెంట్స్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ధన్య లాల్ సలాం అనే సినిమాలో నటించారు. దాంతో ఇప్పుడు ధన్య మీద కామెంట్స్ మరింత ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ధన్య స్పందించి వివరణ ఇచ్చారు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయం గురించి తాను మాట్లాడుతున్నాను అని, ఇన్ని సంవత్సరాల్లో తన కుటుంబంపై ఎన్నో రకమైన కామెంట్స్ వచ్చాయి అని అన్నారు.

dhanya balakrishna facebook post

“వాళ్ళని కాపాడుకోవడంలో భాగంగా నేను ఈ విషయం మీద మాట్లాడడం కుదరలేదు. కానీ ఇప్పుడు నేను ఆ కామెంట్స్ చేయలేదు అని చెప్తున్నాను. నేను తమిళ ఇండస్ట్రీలోనే నా కెరీర్ మొదలు పెట్టాను. ఇక్కడ పని చేయడం నేను గౌరవంగా భావిస్తాను. నాకు తమిళ్ ప్రేక్షకులు మొదటి ప్రేక్షకులు. ఒక స్త్రీగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పెట్టను కూడా. ఈ కామెంట్ తో నాకు సంబంధం లేదు. కానీ నేను ఇందులో ఇరుక్కున్నాను. ఇప్పుడు నేను తమిళ ప్రేక్షకులందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అని తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ రాశారు ధన్య.

https://www.instagram.com/dhanyabalakrishna/p/C212D3SR-63/?hl=en&img_index=1

ALSO READ : కుమారి ఆంటీ తర్వాత ఫుడ్ బిజినెస్ లో ఫేమస్ అయిన మరొక ఆవిడ ఎవరో తెలుసా..? ఇక్కడ ఒక ప్లేట్ ధర ఎంతంటే..?


You may also like

Leave a Comment