“జయం”లో “సదా” చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తుందంటే?

“జయం”లో “సదా” చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఏం చేస్తుందంటే?

by Mohana Priya

Ads

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు.

Video Advertisement

కానీ కొంతమంది మాత్రం కేవలం ఒక హాబీ లాగా మాత్రమే చిన్నతనంలో నటిస్తారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మొదటి సినిమా తో పాపులర్ అయిన వాళ్లలో యామిని శ్వేత ఒకరు.

జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో నటించారు శ్వేత. ఆ తర్వాత ప్రేమలేఖ రాశా అనే సినిమాలో కూడా నటించారు. శ్వేత తల్లి జయలక్ష్మి కూడా మనందరికీ తెలిసిన నటే. జయలక్ష్మి ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

శ్వేత కి టెన్త్ క్లాస్, నచ్చావులే వంటి సినిమాల్లో కూడా నటించమని ఆఫర్స్ వచ్చాయట. కానీ శ్వేత కి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలి అని లక్ష్యం అట. అందుకే డిగ్రీ పూర్తి చేసిన విదేశాలకి తర్వాత వెళ్లి మాస్టర్స్ చేసి ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారట శ్వేత. శ్వేత కి ఇటీవల పెళ్లయింది.

శ్వేత క్లాసికల్ డాన్సర్ అట. ఒకవేళ మళ్లీ సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, తనకి సినిమాలు అంటే అంతగా ఆసక్తి లేదు, ఒకవేళ అరుంధతి లాంటి సినిమా అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట శ్వేత. మామూలుగా చిన్నప్పుడు ఇలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే, అది కూడా ఇంత బాగా నటిస్తే పెద్దయిన తర్వాత కచ్చితంగా మళ్లీ ఇండస్ట్రీ కి వస్తారు అనుకుంటాం. కానీ కొంతమంది మాత్రం నటనని అంత సీరియస్ గా తీసుకోరు. దానికి కారణం వాళ్లకి వేరే రంగం వైపు ఆసక్తి ఉండడమే.

తనకి చదువుకొని ఉద్యోగం సంపాదించడం అంటే అంత ఆసక్తి కాబట్టే శ్వేత ఇప్పుడు కష్టపడి ఉద్యోగం సంపాదించి అంత ఎత్తుకి ఎదిగారు. శ్వేత మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది చిన్నతనంలో నటించిన వాళ్లు కూడా ఇలాగే చిత్ర పరిశ్రమ కి వీడ్కోలు పలికి వారికి నచ్చిన రంగంలో స్థిరపడ్డారు. కొంతమంది కి సోషల్ మీడియా లో అకౌంట్స్ ఉండడంతో వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది మాత్రం సినిమాలకే కాకుండా సోషల్ మీడియా కి కూడా దూరంగా ఉంటున్నారు. ఏది ఏమైనా కానీ ఇలా తెరపై వారి ప్రతిభ నిరూపించుకున్న వారు, వారికి నచ్చిన రంగంలో కూడా అలాగే వాళ్లు అనుకున్నది సాధించాలి అని ఆశిద్దాం.

 


End of Article

You may also like