సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వేరే భాషలకు చెందిన నటులు చాలా మంది ఉంటారు. కొంత మందికి భాష వస్తుంది. కొంత మందికి భాష రాదు. అలా భాష రానప్పుడు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు. తర్వాత వారు తప్పులు ఏమైనా చెప్తే అవి డబ్బింగ్ లో కవర్ అయిపోతాయి. అయితే అలా భాషరాని నటులతో నటిస్తూ ఉంటే మిగిలిన వారు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. జయంతి గారి విషయంలో కూడా ఇలానే జరిగింది.

Jayanthi and Savitri shocking incident

జయంతి గారికి భాష రాకపోవడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నది మరెవరో కాదు. మహానటి సావిత్రి గారు. జయంతి గారు కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో ఒక తమిళ్ సినిమా చేస్తున్నారు. అదే సినిమాలో సావిత్రి గారు కూడా నటిస్తున్నారు. అయితే జయంతి గారికి ఎంతసేపటికీ డైలాగ్స్ రావట్లేదట. దాంతో డైరెక్టర్ అనేక షాట్లు తీయాల్సి వచ్చింది.

Jayanthi and Savitri shocking incident

నెక్స్ట్ షాట్ కోసం ఎదురుచూస్తున్న సావిత్రి గారు డైరెక్టర్ తో, యూనిట్ డైరెక్టర్స్ తో డైలాగ్ చెప్పడం కూడా రాని వాళ్ళని ఎలా తీసుకున్నారు అని జయంతి గారి ముందే అన్నారట. దాంతో జయంతి గారు బాధ పడ్డారు. కారు లోకి వెళ్లి ఏడ్చేశారట. నిర్మాతలను కలిసి ఈ సినిమాలో తాను నటించలేను అని, ఎంత ఖర్చు అయిందో చెప్తే అంత మొత్తాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి సినిమా నుండి తప్పుకున్నారు.

Jayanthi and Savitri shocking incident

అయితే కొన్నాళ్ళకు ఒక కన్నడ సినిమాలో సావిత్రి గారు నటించారు. ఇదే సినిమాలో జయంతి గారు కూడా నటించారు. సెట్స్ లోకి వచ్చిన సావిత్రి గారిని చూసిన జయంతి గారు వెళ్లి సావిత్రి గారి కాళ్ళమీద పడిపోయారట.అప్పుడు సావిత్రి గారు, “నువ్వు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ వి. నువ్వు నా కాళ్ళ మీద పడటం ఏంటి?” అని అడిగారట.

అందుకు జయంతి గారు అప్పుడు జరిగిన సంఘటన అని గుర్తు చేసి, “ఆ రోజు మీరు అలా తిట్టడం వల్లే నేను పూర్తిగా తమిళ్ నేర్చుకున్నాను” అని చెప్పారు. అలా జయంతి గారు ఆ మాటలని పాజిటివ్ గా తీసుకొని తమిళ్ నేర్చుకొని కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తర్వాత ఇంకా ఎన్ని భాషల్లో కూడా నటించారు.