ఆర్ఆర్ఆర్ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ మరెంత పెరిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో ఇంకో సినిమా చేస్తున్నారు. అయితే సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. ‘ఎన్టీఆర్‌ 30’ పేరు తో ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బ్లాక్ బస్టర్ అయ్యింది.

Video Advertisement

దీనితో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది అంతా అనుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను ఇప్పుడు పూర్తి అయ్యింది.

is koratala siva trying to take bandla ganesh title for NTR 30

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ని తెర మీద కి తీసుకు వస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ సినిమా కి మ్యూజిక్ ఇస్తున్నారు. అలానేఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. హీరోయిన్ కి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా లో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఈ సినిమా లో మాస్ రోల్ లో జాన్వీ కపూర్ కనపడనున్నారు. మొదట నుండి ఈమె క్లాస్ పాత్రలనే చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మాస్ రోల్ లో జాన్వీ కపూర్ కనపడనున్నారు. మరి ఎలా ఆకట్టుకుంటారో చూడాల్సి వుంది.

మరి ఈ సినిమా కోసం జాన్వీ ఎంత తీసుకోనున్నారు అన్నది చూస్తే… 4 కోట్ల రూపాయలు ఈ సినిమా కి జాన్వీ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పుడు తీసుకునే దాని కంటే తక్కువ రెమ్యునరేషన్ కి ఈమె ఒప్పుకుంది. ఈ సినిమా ని 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసుకు వస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని తారక్ ఫ్యాన్స్ ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు.