Home News పెళ్ళైన వారానికే పనికోసం సిటీకి వచ్చాడు.. 6 నెలల తర్వాత భార్య కోసం వచ్చి.. ఆ తర్వాత ఆత్మహత్య.. అసలేమైందంటే?

పెళ్ళైన వారానికే పనికోసం సిటీకి వచ్చాడు.. 6 నెలల తర్వాత భార్య కోసం వచ్చి.. ఆ తర్వాత ఆత్మహత్య.. అసలేమైందంటే?

by Anudeep

ఆ వ్యక్తికి ఆరు నెలల క్రితమే పెళ్లయింది. అయితే పరిస్థితుల దృష్ట్యా పెళ్ళైన వారానికే పనికి వెళ్ళిపోయాడు. తిరిగొచ్చేసరికి భార్య మాటలను విని హతాశుడయ్యాడు. ఆ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాకు చెందిన జితేంద్ర దాస్‌ ఆరు నెలల క్రిందటే వివాహం చేసుకున్నాడు. అయితే పొట్ట కూటి కోసం తన భార్యని ఇంట్లోనే ఉంచి ఉద్యోగం కోసం పట్నం వెళ్ళాడు.

ఒక ఆరు నెలల పాటు పనులు చేసుకుని కొంత డబ్బుని వెనకేసుకున్నాడు. తిరిగి సొంతూరుకు వచ్చి భార్యని తీసుకుని వెళ్దాం అని అనుకున్నాడు. కానీ, ఆరు నెలల తరువాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య లేదు. భార్య పుట్టింట్లో ఉందని తెలియడంతో.. ఆమె కోసం పుట్టింటికి వెళ్ళాడు. తనతో పాటు రావాలని కోరాడు.

Also Read: ఈ చిన్నప్పటి టాలీవుడ్ సెలెబ్రిటీని ఎవరో గుర్తుపట్టారా..? చెప్పుకోండి చూద్దాం..!

jitendra

ఆమె మాట్లాడిన మాటలకు జితేంద్ర హతాశుడయ్యాడు. ఆమె తనతో పాటు రావడానికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే.. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తండ్రి కొడుకులు ఒకే చిత్రంలో నటించిన హీరోలు మరియు వారి సినిమాలు..! లిస్ట్ లో ఉన్న 8 ఎవరో చూడండి.!

You may also like