కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Video Advertisement

మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని పాత్రలో గానీ సైడ్ రోల్స్ లో కానీ కనిపించి తర్వాత మెల్లగా లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా వారిలో ఇటీవల లైన్ గా హిట్ కొట్టిన హీరో కూడా ఉన్నారు.

josh movie side artist now became a popular hero

వివరాల్లోకి వెళితే, నాగ చైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్. ఈ సినిమాకి వాసు వర్మ దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కాలేజ్ గొడవలు, ర్యాగింగ్, కాలేజ్ లో ఉండే రాజకీయాలు అనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది. మొదటి సినిమాతోనే నాగ చైతన్య మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనే పేరు సంపాదించుకున్నారు.

josh movie side artist now became a popular hero

ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు సిద్దు జొన్నలగడ్డ. సిద్దు మొదటి సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమాలో, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కూడా నటించారు సిద్దు. ఆ తర్వాత 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించారు. 2016లో వచ్చిన గుంటూర్ టాకీస్ సినిమాతో గుర్తింపు సంపాదించారు సిద్దు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

josh movie side artist now became a popular hero

సిద్దు ఇటీవల హీరోగా నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. అలాగే ఆ తర్వాత నటించిన మా వింత గాధ వినుమా సినిమా కూడా ఆహాలో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ రెండు సినిమాలకి రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా చేశారు సిద్దు. అలాగే సిద్దు హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా కూడా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి కూడా కథ సిద్దు అందించారు. అలా హ్యాట్రిక్ హిట్స్ సంపాదించారు సిద్దు. థియేటర్స్ లోనే కాదు ఓటిటి లో కూడా డీజే టిల్లు సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.