జూనియర్ ఎన్టీఆర్ నటనలో అయన తాత గారి పేరుని నిలబెట్టారు. నటనలో,డ్యాన్సుల్లో ఆయనకి వెండితెర మీద తిరుగు లేదని నిరూపించుకున్నారు. నందమూరి వారసుడిగా ప్రజల చేత జేజేలు కొట్టించుకుని, తిరుగులేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. అంతేనా ఇక బుల్లితెర పైన కూడా అయన తన హవా ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Meelo evaru koteswarulu

Meelo evaru koteswarulu

జెమినీ టీవీ లో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కి హోస్టింగ్ చేస్తున్న ఎన్టీఆర్ గత సీజన్లలలోనే ఎన్నడూ లేనంతగా ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ షో. సుమారు 11 .5 trp రేటింగ్స్ ని సాధించింది ఈ షో. కాకపోతే ఇటీవలే అయన పైన కొన్ని ట్రోల్ల్స్ సోషల్ మీడియా లో వస్తున్నాయి. దానికి కారణం మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రాం లో అడుగుతున్న ప్రశ్నలే కారణం. “మరీ ఇంత సిల్లీ ప్రశ్నలు ఏంటి రా బాబు” అంటూ ట్రోల్ చేస్తున్నారు మరీ స్క్రీన్ షాట్ పెట్టి.

Yevaru meelo koteeswarulu program first guest

ఎలాంటి ప్రశ్నలు ఆ షో లో ఇచ్చారంటే ముళ్ళ అనే అక్షరం జత చేరిస్తే ఒక ప్రాణి పేరు వస్తుంది అదేంటి అని ? టీవీ లో ఛానల్ ని మార్చడానికి దేనిని ఉపయోగిస్తారు అనే మరో ప్రశ్న ని ఇలాంటివి చిన్న పిల్లాడిని అడిగిన జవాబు చెబుతారు కదా? అంటున్నారు. దేని వెనుక అసలు కథ వేరే ఉంది. నిజానికి ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కి సెలెక్ట్ అవ్వాలంటే ఆషా మాషి కాదా ఎన్నో ప్రేక్షలని ఎదురుకొని ఇక్కడి దాకా రావాలి అంతే కాక ఒక పెద్ద స్టార్ ముందు ఎలాంటి తడబాటు లేకుండా జవాబులు ఇవ్వాలి. హాట్ సీట్ వరకు వచ్చాక మొదట్లోనే కష్టమైన ప్రశ్నలు ఇస్తే వారు ఇచ్చే జవాబు గనుక తప్పుగా వస్తే అసలు వారి చేతికి ఒక్క రూపాయి కూడా అందకుండా వెనుతిరగాల్సివస్తుంది. అందుకే కనీసం వారికి పది వేల రూపాయలు అయిన చేతికి అందాలన్న ఉద్దేశం తోనే ఇలాంటి సులువైన ప్రశ్నలని ఇస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇప్పుడైనా ఎన్టీఆర్ పై ట్రోల్ల్స్ ఆగిపోతాయేమో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి: “నువ్వు లావు గా ఉన్నావ్” అన్న జక్కన్న కి ఎన్టీఆర్ ఏమి కౌంటర్ ఇచ్చారంటే..?