Ads
దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేతల్లో JRD టాటా అంటే అంటే జహంగీర్ రతంజీ దాదాభోయ్ టాటా ఒకరు. మంచి మనసు, వినూత్న ఆలోచనలు, సింప్లిసిటీతో ఆయన ప్రజల మనసుల్లో ఉన్నారు. సంస్థ నుంచి కార్లు మాత్రమే కాకుండా అందరికి చేరువవ్వాలనే లక్ష్యంతోనూ టాటా ముందుకు వెళ్లారు. అందుకే టాటా ఉప్పు సహా అనేక నిత్యావసర సరుకులను సైతం ఉత్పత్తి చేస్తున్నారు.
Video Advertisement
అయితే బాలీవుడ్ యాక్టర్ దిలీప్ కుమార్, టాటాల మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకసారి బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ తాను రిజర్వ్ చేసుకున్న ఫ్లైట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చి క్యాన్సిల్ అవ్వడంతో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సి వచ్చింది. లగ్జరీ ఫ్లైట్ మిస్ అయింది. ఎకానమీ ఫ్లైట్ లో వెళ్లడం దిలీప్ కుమార్ కు ఇష్టం లేదు.
అధికారులతో గొడవపడి.. షూటింగ్ ఉండడం వల్ల తప్పనిసరై ఎకానమీ ఫ్లైట్ ఎక్కాడు. ఆ ఫ్లైట్ లోని ప్రయాణికులు దిలీప్ కుమార్ ని చూడగానే సంబరపడిపోయి ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడ్డారు. పక్క సీట్లో ఒక సాధారణమైన మధ్యతరగతి ప్రయాణికుడు కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. అతడు దిలీప్ కుమార్ ని కన్నెత్తి కూడా చూడలేదు. దిలీప్ కుమార్ ఆశ్చర్యపోయి తానే పలకరించాడు. అతడు చిరునవ్వు నవ్వి మళ్ళీ పేపర్ చదువుకోసాగాడు.
ఒక బాలీవుడ్ స్టార్ పక్కన ఉన్నాడన్న ఏ ఫీలింగూ లేదేంటి.. “మీరు సినిమాలు చూడరా…?” అని అడిగాడు. “పెద్దగా చూడనండి..”అని చెప్పాడతడు. మిడిల్ క్లాస్ వాళ్లకి సినిమాలొక్కటే కదా వినోదం.. చూడకపోవడం ఏంటి అనుకుంటూ .. “ఓహో.. అందుకే మీకు నేనెవరో తెలియలేదు. నేను బాలీవుడ్ హీరోని. నా పేరు దిలీప్ కుమార్” అని చివరకు తనను తానే పరిచయం చేసుకున్నాడు. ” ఓ. ఐసీ. గుడ్ జాబ్. ” అని చెప్పి అతను కూల్ గా పేపర్ మూసేసి ఏదో బిజినెస్ జర్నల్ తీసి చదువుకోసాగాడు.
దిలీప్ కుమార్ చాలా అసహనంగా ఉంది. నేనెవరో చెప్పినా కూడా ఆటోగ్రాఫ్ అడగడేంటి.. ఒక మాములు సిటిజన్ కి ఇంత పొగరా.. ఒక బాలీవుడ్ స్టార్ ని నేనే మాట్లాడుతుంటే కనీసం ఆటోగ్రాఫ్ అడగడా..అనుకొని “మీరేం చేస్తుంటారు?” అని అడిగాడు. ” నేను బిజినెస్ మ్యాన్ ని. నా పేరు JRD టాటా అని చెప్పేసరికి దిలీప్ కుమార్ షాక్ అయ్యాడు. ఇతను గ్రేట్ ఇండస్ట్రీయలిస్ట్ JRD టాటా నా.. అందుకా ఇంత హుందాగా కూర్చున్నారు అనుకుంటూ.. అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంత సాధారణమైన వస్త్రధారణలో, ఎకానమీ క్లాస్ లో ఎందుకు?
“నేనెప్పుడూ ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తాను దిలీప్ గారూ. అందులో తప్పేముంది? నాకు మొదటినుంచి సామాన్యంగా జీవించడం అలవాటు” అని చెప్పగా, దిలీప్ కుమార్ అతని గొప్పతనానికి ఆశ్చర్యపోయి తానే అతని ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నాడు. డబ్బు సంపాదించాలని కాదు, కానీ అది లేని చోట సంతోషాన్ని సృష్టించాలని చూడాలనే బలమైన కోరిక ఉన్న గొప్ప వ్యక్తి JRD టాటా.
End of Article