Ads
దేవాలయాలు కంటే స్కూల్స్ , హాస్పిటల్స్ ముఖ్యం.. జ్యోతికే కాదు..ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఏకకంఠంతో అనాల్సిన మాట ఇది.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫైట్ చేస్తున్నది డాక్టర్లే.. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే సరైన వసతులు లేక ఇబ్బంది పడాల్సింది మనమే…అయినా నిజాల్ని నిజాయితిగా మాట్లాడినప్పుడు అభినందించాల్సింది పోయి, లేని రచ్చ క్రియేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్. జ్యోతిక ఆ కామెంట్స్ చేసింది ఎప్పుడు? ఎప్పుడో జరిగిన దాన్ని వెలికి తీసి ఇప్పుడు గొడవ చేస్తున్నది ఎవరు??
Video Advertisement
తెలుగు , తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా పరిచయం అయి, టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక, పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ మళ్లీ తెర మీదకు వచ్చింది. లాస్ట్ ఇయర్ రాచ్చసి అనే సినిమాలో నటించిన జ్యోతిక.. అందులో ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ గా నటించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మౌలిక సదుపాయాలు లేని ఓ పాఠశాలను ఓ హెడ్ మాస్టర్ ఎలా సంస్కరించింది.. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సృష్టిస్తున్న అడ్డంకులకు ఎదురొడ్డి ప్రభుత్వ పాఠశాలను సమర్థవంతంగా ఎలా నిర్వహించింది అన్నది రాచ్చసి సినిమా .
“రాచ్చసి” లో నటనకు గాను “జస్ట్ ఫర్ వుమెన్” అనే ఓ మేగజైన్ సినీ అవార్డుల ఫంక్షన్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా రాచ్చసి(తమిళ) సినిమాలో నటనకు గాను హీరోయిన్ జ్యోతిక ఉత్తమ నటి అవార్డు సిమ్రాన్ చేతుల మీదుగా అందుకుంది.ఈ అవార్డు ఫంక్షన్ జరిగింది ఫిబ్రవరిలో..అవార్డు అందుకున్న తర్వాత స్టేజిపై జ్యోతిక మాట్లాడిన మాటలు అప్పట్లోనే చర్చించాల్సిందిపోయి.. ఇప్పుడు రచ్చనీయాంశం అయ్యాయి…
ఇంతకీ జ్యోతిక మాట్లాడిన మాటలేంటంటే “తంజావూరులో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు, అక్కడి బృహదీశ్వర ఆలయం అత్యద్భుతంగా ఉంటుంది ,తంజావూరు వచ్చినవారు దాన్ని చూడకుండా వెళ్లరు అని చాలామంది చెప్పారు. అయితే అంతకుముందే నేను ఆ ఆలయాన్ని చూశాను. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌ల తరహాలో అది చాలా అందంగా ఉంటుంది.ఆ మరుసటి రోజే తాను ఓ స్కూల్లో షూటింగ్‌కు వెళ్లానని అక్కడి పరిస్థితులు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు,మౌలిక సదుపాయాలు ఆ స్కూల్లో లేవు. కాని మనకి దేవాలయాల కన్నా స్కూళ్లు, హాస్పిటల్స్ ముఖ్యం ” అన్నారు.
ఇదే సంధర్బంలో రాచ్చసి సినిమా ద్వారా ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేసుకున్నారు అదేంటంటే “మీరు దేవాలయాల కోసం చాలా డబ్బును విరాళంగా ఇస్తుంటారు. వాటి పెయింటింగ్,నిర్వహణకు చాలా డబ్బును వెచ్చిస్తుంటారు. వెళ్లిన ప్రతీసారి హుండీలో డబ్బులు వేస్తుంటారు. అలాగే స్కూళ్లు,ఆసుపత్రుల నిర్వహణకు కూడా అంతే డబ్బును వెచ్చించండి. అవి మనకు చాలా ముఖ్యమైనవి” అని సినిమాలో చెప్పిన సందేశాన్ని వివరించారు.
ఇది అసలు విషయం ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగి పోయిన విషయాన్ని ఇప్పుడ తెరమీదకు తెచ్చి కొంతమంది జ్యోతిక హిందూ దేవాలయాలనే ఎందుకు అంటున్నారని కొందరు స్వామిజిలు, కొంతమంది హిందూవాదులు జ్యోతిక వ్యాఖ్యలని ట్రోల్ చేస్తున్నారు.. అయితే జ్యోతికకి తన భర్త సూర్యతో పాటు,సినినటులు, నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మద్దతుగా నిలిచారు.. అయినా జ్యోతిక కామెంట్ చేశారని కాదు, ప్రస్తుతం కళ్లముందు ప్రత్యక్షంగా కనపడుతోంది మనకి ఏది అవసరం , ఏది అనవసరం అనేది ఈ సమయంలో ఇలాంటి వివాదస్పద విషయాలు తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం..
End of Article