కార్తి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా బాగా హిట్ అయింది. ఈ సినిమా కార్తీ జైలు నుండి బయటకి వచ్చాక తన కూతురిని చూడాలని అనుకుంటాడు. ఈలోగా పోలీసులకి సహాయం చెయ్యాల్సి వస్తుంది. ఎస్పీ ఆఫీస్ లో డ్రగ్స్ ని తీసుకు వెళ్లేందుకు విలన్స్ ప్రయత్నం చేయడం ఇలా ఈ మూడు విషయాల మీద కథ నడుస్తుంది.

Video Advertisement

ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాని లోకేష్ కానక రాజ్ దర్శకత్వం వహించారు. ఎస్సార్ ప్రకాష్ బాబు, ఎస్సార్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కింద ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు.

తిరుపూర్ వివేక్ వివేకానంద పిక్చర్స్ బ్యానర్ కింద కో ప్రొడ్యూస్ చేశారు. అలానే కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ కూడా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా నటించారు. లోకేష్ కనక రాజ్ ఏ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసారు. ఈ సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ప్రపంచన్ (కాళిదాస్ జయరామ్) అనే ఒక అమరవీరుడి తండ్రి అయిన కర్ణన్ (కమల్ హాసన్) హత్యకు గురవుతారు అనే విషయంతో సినిమా మొదలవుతుంది. కొంత మంది వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి ఇలాంటి హత్యలు చేశారు అని తేలుతుంది. వ్యవస్థ మీద వారు యుద్ధం చేస్తున్నారు అని, ఆ క్రమంలోనే ఇలా చేస్తున్నారు అని తెలుస్తుంది. జోస్ (చెంబన్ వినోద్ జోస్) అనే ఒక పోలీస్ చీఫ్ చెప్పడంతో అమర్ (ఫహాద్ ఫాసిల్) నేతృత్వంలో ఉన్న ఫోర్స్ ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది.

ఈ క్రమంలో అమర్ కర్ణన్ జీవితానికి సంబంధించిన విషయాలని తెలుసుకుంటూ ఉంటాడు. కానీ కర్ణన్ ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అమర్ తెలుసుకోలేకపోతాడు. మరొక పక్క సంతానం (విజయ్ సేతుపతి) ఎన్నో వ్యాపారాలు నడుపుతూ ఉంటాడు. అసలు కర్ణన్ ఎవరు? కర్ణన్ కి తన కొడుకు అంటే నిజంగానే ఇష్టమా? కర్ణన్ చనిపోయాడా? బతికే ఉన్నాడా? అనేదే కథ. అయితే విక్రమ్ సినిమాలో సంతానం చనిపోయాడు. అయితే సంతానం ప్లేస్ లో లారెన్స్ నటించనున్నాడు. ఖైదీ 2 లో లారెన్స్ మరియు కార్తీ తలపడతారు.