Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వరుస విజయలతో దూసుకుపోతోన్న మహేష్ కోసం ఈసారి గురూజీ ఓ డిఫరెంట్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్.
Video Advertisement
ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించట. అయితే ఇంతలోనే మహేష్ తల్లిగారు ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో రఫ్ గా కనిపించనున్నారు మహేష్. ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ హల్చల్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో మహేష్ బాబుకి అక్కగా ఈ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.అక్క సెంటి మెంట్ ను ప్రధానంగా మలుచుకుంటూ మహేష్ బాబు అక్క సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . షాకింగ్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్క రోల్ చేస్తుంది ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో కాజల్ అగర్వాల్ మహేష్ బాబుకి అక్క రోల్ లో కనిపించబోతుంది. సినిమా మొత్తం అక్క సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కి అక్కగా నటించడానికి కాజల్ ఓకే చేసిన్నట్లు సినీ వర్గాలలో న్యూస్ వైరల్ గా మారింది.
కాగా మహేష్ బాబు కాజల్ కాంబినేషన్ లో బిజినెస్ మాన్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి జోడిని తీసుకొచ్చి తెరపై అక్క తమ్ముడు గా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నదే బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది.
అంతేకాదు ఈ సినిమాకి టైటిల్ గా అర్జునుడు అనే పేరును ఫిక్స్ చేశారట. ఆ విధంగా చూసుకున్న సినిమాకి ఈ రెండు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్లుగా మారనున్నాయి. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమా ఎలాంటి ఫ్లాప్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సేమ్ ఈ సినిమాలో కూడా అక్క సెంటిమెంట్ ఆధారంగానే తెరకెక్కింది. అయితే ఈ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని సినీ విశ్లేషకులు ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అవ్వనున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. దీనిపై నెట్టింట చర్చలు మొదలవుతున్నాయి.
End of Article