కాజల్ చెప్పినట్టు చేస్తే అసలు విడాకులు తీసుకోరు ఏమో..? భర్త గురించి ఎంత బాగా చెప్పారో చూశారా..?

కాజల్ చెప్పినట్టు చేస్తే అసలు విడాకులు తీసుకోరు ఏమో..? భర్త గురించి ఎంత బాగా చెప్పారో చూశారా..?

by Harika

Ads

ఎవరైనా ఇద్దరు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవడం అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది. కొంత మంది కారణాలు బలంగా ఉంటున్నాయి. కానీ కొంత మంది కారణాలు మాత్రం అర్థం అయ్యి అవ్వనట్టుగా ఉంటున్నాయి. అందులోనూ ఈ మధ్య విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. వారానికి ఒకరు తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నారు. దీనికి వ్యక్తిగతంగా చాలా కారణాలు ఉంటాయి. కానీ అందరికీ కనిపించేది కేవలం విడాకులు తీసుకోవడం అనే విషయం మాత్రమే. సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మధ్య సరైన అర్థం చేసుకోవడం లేకపోవడమే. ఎన్నో సంవత్సరాలు ప్రేమలో ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం మనస్పర్ధలు వస్తాయి.

Video Advertisement

kajal aggarwal about family and profession

పని కారణంగా బిజీగా ఉండడం వల్ల సమయం గడిపే వీలు కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి పెళ్లి తర్వాత ఒకవేళ మనిషిలో మార్పులు వస్తే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే డివోర్స్ తీసుకుంటారు. పెళ్లయ్యాక తన భర్తతో తాను విషయాలను ఎలా పరిష్కరిస్తున్నాను అనే విషయాన్ని కాజల్ ఇటీవల జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాజల్ మాట్లాడిన మాటలు ఎంతో పరిణితిగా అనిపించాయి. అంత అవగాహన ఉంటే నిజంగా ఎవరు విడాకులు తీసుకోరు అన్నట్టు అనిపించాయి.

కాజల్ ఈ విషయం మీద మాట్లాడుతూ, “నేను ప్రతి విషయాన్ని నా కుటుంబంతో, నా భర్తతో చర్చిస్తాను. వాళ్లే నాకు అన్ని. ప్రతి విషయాన్ని మనం కమ్యూనికేట్ చేయాలి. మన ఆలోచనలు ఏంటి? మనం ఏం చేయాలి అనుకుంటున్నాం? మన రోజు షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒకవేళ బిజీగా ఉంటే, “ఇది ఇవాల్టికి నా షెడ్యూల్. ఒకవేళ నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే నేను ఈ పనిలో ఉంటాను. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన విషయం అయితే, ఆ విషయం మీద నాతో మాట్లాడాలి అనుకుంటే, నాతో మాట్లాడే వీలు లేకుంటే, నా అసిస్టెంట్ కి చెప్పు. అతను నాకు వెంటనే ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. లేకపోతే నా మేకప్ ఆర్టిస్ట్ కి కాల్ చెయ్యి. నా జీవితంలో ఏం నడుస్తున్నా కూడా నేను అయితే నీకు అందుబాటులో ఉంటాను.”

“నా ప్రయారిటీ నువ్వే. కాబట్టి నేను ముందు నీకు అందుబాటులో ఉంటాను. తర్వాత మిగిలిన పనులు చూసుకుంటాను.” అని చెప్పాను. మొదటి రోజు నుంచి ఇలాగే ఉంటున్నాం. ఈ విషయాల్లో నాకు, నా భర్తకి స్పష్టత ఉంది” అని చెప్పారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాజల్ ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు అని కాజల్ మాట్లాడిన మాటలు వింటుంటేనే అర్థం అవుతోంది. అందుకే కాజల్ ఆలోచన విధానం చాలా బాగుంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like