బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Video Advertisement

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. ఇదిలా ఉండగా మొన్నటి ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ జరిగింది.

kajal hugging manas in bigg boss telugu 5 unseen footage

ఈ ఎపిసోడ్‌కి సంబంధంచిన ఒక అన్‌సీన్ ఫుటేజ్ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమయం కథనం ప్రకారం, ఇందులో కాజల్, మానస్ రాత్రి పూట మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా మానస్‌ని హగ్ చేసుకొని కాజల్ ఏడవడం ఈ వీడియోలో చూపించారు. మరి వాళ్లు ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం క్లియర్ గా వినిపించలేదు. అంతకుముందు సన్నీ, మానస్, కాజల్ పూల్ దగ్గర కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు.

kajal hugging manas in bigg boss telugu 5 unseen footage

కాజల్ తో మానస్, “పింకీది నాది ఎటు వెళుతుందో తెలియదు. వాళ్ల సిస్టర్ వచ్చి మొన్న నాకు సారీ చెప్పారు. అలా ఎందుకు అన్నారో అర్ధం అవ్వట్లేదు. బయట ప్రేక్షకులకి ఇది అంతా ఎలా అర్ధమౌతోందో” అని అన్నారు. ఇంక షో విషయానికొస్తే, ఈ రోజు టిక్కెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్స్ కి ఎంట్రీ పొందుతారు. ఇవాళ ఈ టాస్క్‌లో సన్నీ, సిరికి మధ్య గొడవ జరగడం మనం ప్రోమోలో చూడొచ్చు.