ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. నిజానికి ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వాలంటే ట్యాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. నటి కాజల్ అగర్వాల్ మనకి తెలుసు. ఆమె గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. లక్షీ కళ్యాణం సినిమా తో కాజల్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది.

Video Advertisement

ఆ తరవాత నుండి చాలా తెలుగు సినిమాలలో నటించింది ఈ భామ. చక్కటి పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

kajal agarwal as mahesh sister in trivikram movie..!!

ఈమె ఇండస్ట్రీ కి వచ్చి సుమారు 15 సంవత్సరాలు అవుతోంది. పైగా ఆమె ఫాలోయింగ్ కూడా పెరిగి పోయింది. కాజల్, గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరవాత ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం తో కాస్త గ్యాప్ వచ్చింది. అందం, యాక్టింగ్ తో కాజల్ ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. ఓ బిడ్డకి జన్మనిచ్చిన కాజల్ బిడ్డ ని చూసుకుంటోంది. ఇప్పుడు ఈ భామ ఇండియన్ 2 లో హీరోయిన్‌ గా చేస్తోంది. శంకర్ దర్శకత్వం లో ఈ సినిమా వస్తోంది. ఇండియన్ 2 లో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు.

కానీ ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈమె వేగంగా దూసుకు వెళ్తోంది. రీ ఎంట్రీ ఇస్తున్న ఈమెకి అవకాశాలు కూడా జోరు గానే వచ్చేస్తున్నాయి. అయితే కాజల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అనేది వైరల్ గా మారింది. రీ ఎంట్రీ తరువాత కాజల్ అగర్వాల్ సీనియర్ నటుల తో నటించే ఛాన్స్లు వస్తున్నాయి. అయితే ఈమె ఒక సినిమా కి ఇంచుమించుగా మూడు కోట్ల రూపాయలని తీసుకుంటోందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు బ్రేక్ తీసుకుని రీ ఎంట్రీ ఈమె ఇచ్చినా సరే అంత రెమ్యునరేషన్ అడగడం షాకింగ్ గా వుంది. పైగా తాను ఏ మాత్రం తగ్గడం లేదు. రీ ఎంట్రీ తరవాత అవకాశాలు ఎక్కువ రావడం, డిమాండ్ ఉండడం గొప్ప విషయమే.