Ads
మొదటి నుండి స్ట్రాటజీతో కాజల్ బిగ్ బాస్ లో ఆడడం మనం చూసాం. వారాలు గడిచే కొద్దీ ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతోంది. ముఖ్యంగా సన్ని విషయంలో ఈమె స్టాండ్ తీసుకోవడం మొదలు ఈమెకి ఫ్యాన్ గ్రూప్స్ పుట్టుకొచ్చాయి.
Video Advertisement
అయితే కాజల్ స్ట్రాటజీ ఒక రకంగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. పైగా మొదటి నుండి కూడా ఈమె బిగ్ బాస్ అంటే ఇష్టంతోనే ఆడడం జరుగుతోంది. అవతల వాళ్ళు ఎవరైనా సరే ఆమె ముఖం పైనే చెప్పేస్తుంది. ఆ లక్షణమే ఆమెని మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మార్చింది.
ఎవిక్షన్ పాస్ విషయంలో కాజల్ తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. అయితే కాజల్ గేమ్ ఆడితే ఇలానే ఉంటుందని కామెంట్లు కూడా ప్రేక్షకులు చేశారు. నాకు నా ఫ్రెండ్ అంటే ఇష్టం.. అందుకే విన్నర్ గా చూడాలని అనుకున్నానని ఆమె శ్రీరామచంద్ర కి నామినేషన్స్ అప్పుడు కూడా గట్టిగా చెప్పేసింది. అయితే ముందుగానే సన్నీ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని ఊహించింది అనే టాపిక్ వైరల్ అవుతోంది.
End of Article