Ads
మన దగ్గర డబ్బులు ఉన్నా ఒక్కోసారి పర్సు మర్చిపోవడమో.. లేక కాష్ డ్రా చేసి పెట్టుకోకపోవడమో జరుగుతూ ఉంటాయి. మనం వేరే ఊర్లు వెళ్ళినప్పుడు ఇలా జరుగుతూ ఉంటె ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది. లేదా… ఏదైనా షాప్ లో మనకి కావాల్సింది తీసుకున్నాక డబ్బులు ఇవ్వకపోతే మనం ఇబ్బంది ఫీల్ అవుతాం.
Video Advertisement
వాళ్ళు మంచితనంతో మనకి ఫ్రీ గా ఇచ్చేసినా.. మనకి కొంచం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అటువైపు వెళ్ళడానికి కూడా ఒకలాంటి మొహమాటాన్ని ఫీల్ అవుతూ ఉంటాం..
అయితే ఇదే పరిస్థితి కాకినాడకు చెందిన మోహన్ నేమాని అనే వ్యక్తికి కూడా ఎదురైంది. అయితే ఇలాంటి పరిస్థితి అతనికి 12 సంవత్సరాల క్రితం ఎదురైంది. మోహన్ కుమారుడు ప్రణవ్ ఓ చిన్న వ్యాపారి దగ్గర వేరు శనగకాయలు కొనుక్కున్నాడు. కానీ డబ్బులు ఇద్దాం అంటే మోహన్ పర్సు ని మర్చిపోయాడు. అయితే ఆ వ్యాపారి పర్వాలేదని.. మరోసారి ఇవ్వొచ్చని చెప్పి పంపించేశాడు.
సదరు వ్యాపారి ఈ విషయాన్ని మర్చిపోయినా.. మోహన్ కుమారుడు ప్రణవ్ మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన మోహన్ నేమాని కుటుంబం అమెరికాలోనే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు ఇండియా కి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో 2010 లో కూడా ఒకసారి మోహన్ కుమారుడు ప్రణవ్, కుమార్తె తో పాటు కాకినాడ బీచ్ కి వెళ్లారు. ఆ టైములో అక్కడ వేరు శనగకాయలు అమ్ముతున్న వ్యాపారి సత్తెయ్య దగ్గర వేరు శనగకాయలు తీసుకున్నారు. కానీ పర్సు మర్చిపోవడంతో డబ్బులు ఇవ్వలేకపోయారు.
ఆ తరువాత కూడా వారు ఆ బీచ్ కి పలుసార్లు వచ్చారు. కానీ సత్తెయ్య కనిపించలేదు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి మోహన్ కు స్నేహితుడే కావడంతో.. ఈ విషయం గురించి ఎమ్మెల్యే కి కూడా చెప్పారు. అయితే.. ఆయన మోహన్ కుమారుడు ప్రణవ్, సత్తెయ్యతో తీసుకున్న ఫోటోని ఫేస్ బుక్ లో పెట్టించారు. ఇతని గురించి వివరాలు తెలిస్తే చెప్పాలంటూ కోరారు. ఎట్టకేలకి సత్తెయ్య ఆచూకీ దొరికింది. సత్తెయ్య కుటుంబం జిల్లాలోని యూ.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో ఉంటోందని తెలిసింది. విషయం తెలియగానే గురువారం.. వారిని కాకినాడలో ఎమ్మెల్యే ఇంటికి పిలిపించారు. మోహన్,ఆయన పిల్లలు కలిసి సత్తెయ్య కుటుంబానికి పాతిక వేల ఆర్ధిక సాయం అందించారు.
End of Article