జైలర్ చిత్ర నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి అపోలో హాస్పటల్ చైర్మన్ ఉపాసన కొణిదల తాతయ్య అయినా డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డికి ఓ చెక్ ఇచ్చారు.

Video Advertisement

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఇంతకీ ఆ చెక్ వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? చాలాకాలం తర్వాత రజనీకాంత్ కు మంచి సక్సెస్ ఇచ్చిన చిత్రం జైలర్. జైలర్ మూవీ తీసిన నిర్మాతకు ఈ చిత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

kalanithi maran check to upasana konidela grand father

జైలర్ ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో పండుగ వాతావరణం నెలకొంది. దీంతో నిర్మాత కళానిధి మారని పలు రకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆగస్టు 10 న విడుదలైన జైలర్ చిత్రం నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. అందుకే సినిమాల్లో వచ్చిన లాభాన్ని మొత్తం తనకే ఉంచుకోకుండా హీరో,దర్శకుడు ,సంగీత దర్శకుడు ఇలా అందరితో నిర్మాత షేర్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగా హీరో రజనీకాంత్ ను కలిసి కళానిధి చెక్ ఇచ్చారు కానీ అందులో ఎంత అమౌంట్ వేసి ఉంది అన్న విషయాన్ని వెల్లడించలేదు. అయితే అందులో 100 కోట్ల సంఖ్య ఉంది అని బయట ప్రచారం జరుగుతుంది. అప్పటికే సినిమాకి హీరోగా రెమ్యూనరేషన్ కింద 110 కోట్లు పుచ్చుకున్న రజిని ఈ 100 కోట్లు కూడా కలవడంతో 210 కోట్లు ఒక్క సినిమాకి తీసుకున్న నటుడిగా కొత్త రికార్డు సృష్టించాడు. దాంతో పాటుగా ఒకటిన్నర కోటి విలువచేసే బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ సీరీస్ కారణం కళానిధి రజనీకాంత్ కు బహుమతిగా అందించారు.

comments on this scenes in jailer

అంత అమౌంట్ ఖర్చు పెట్టాడు అనుకుంటే.. విషయం ఇంకా ఉంది.. హీరో తర్వాత వంతు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ది. డైరెక్టర్ కి సుమారు కోటి రూపాయల విలువ చేసే పోర్షే మకాన్ లగ్జరీ కార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర కు మరొక చెక్ తో పాటు పోర్షే మకాన్ కారు బహుమతిగా అందజేశాడు కళానిధి. దానితో పాటుగా కొంత అమౌంట్ ని సామాజిక సేవ కోసం కూడా ఉపయోగించాలి అని నిర్ణయించుకొని దానికోసం అపోలో హాస్పిటల్స్ వారికి చెక్ అందివ్వడం జరిగింది.

చెక్ అంటే ఏదో చిన్న మొత్తం అనుకున్నేరు…. వందమంది నిరుపేద పిల్లలకు ఉచితంగా గుండె శాస్త్ర చికిత్స చేయడం కోసం కోటి రూపాయలను అపోలో హాస్పిటల్స్ కు సన్ పిక్చర్ సంస్థ అందజేసింది. ఈ క్రమంలో మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ను కలిసిన కళానిధి భార్య ఆయనకు చెక్ అందించారు. ప్రస్తుతం సన్ పిక్చర్స్ చేపడుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : “గీతా గోవిందం” పాట గొడవతో పాటు… “విజయ్ దేవరకొండ” ఎదుర్కొన్న ఐదు వివాదాలు..!