కల్కి 2898 ఏడి 2వ టైలర్ రివ్యూ..! ఈసారి అంచనాలని అందుకుంటుందా..?

కల్కి 2898 ఏడి 2వ టైలర్ రివ్యూ..! ఈసారి అంచనాలని అందుకుంటుందా..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా నుండి వచ్చిన మొదటి ట్రైలర్ ఇప్పటికే అంచనాలను పెంచింది. సినిమా బృందం పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. కానీ సినిమా మీద అంచనాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా రెండవ ట్రైలర్ విడుదల చేశారు. ఈసారి ఇంకా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ మాళవిక నాయర్ కూడా కనిపించారు. సినిమాలో చాలా మంది అతిథి పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. వారిలో మాళవిక నాయర్ కూడా ఒకరు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

Video Advertisement

kalki 2898 ad second trailer

అయితే, మొదటి ట్రైలర్ బాగున్నా కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ మాత్రం అంచనాలను పెంచే విధంగానే ఉంది. సినిమా కథని ట్రైలర్ లో ఎక్కువగా చూపించట్లేదు. కానీ పాత్రల పోస్టర్స్ మాత్రం రోజుకి ఒకటిగా విడుదల చేస్తున్నారు. వారి పేర్లను కూడా ఆ పోస్టర్స్ లో ఇస్తున్నారు. హైదరాబాద్ లో ప్రమోషనల్ ఈవెంట్స్ ఉండవు. ఇటీవల ముంబైలో జరిగిన ఈవెంట్ ఒకటే ఈ సినిమాకి ప్రమోషనల్ ఈవెంట్. మరి సినిమా బృందం ఇంటర్వ్యూలు ఇస్తారా? లేదా? అనేది కూడా తెలియదు. ఈ ట్రైలర్ లో సినిమా పాట కూడా వినిపించారు.

ఈ సినిమాలో పాటలు కూడా ఎక్కువగా లేవు. రెండు లేదా మూడు పాటలు మాత్రమే ఈ సినిమాలో ఉన్నట్టు సమాచారం. ఒక పాట ప్రమోషన్ కోసం చేసిన పాట అయితే, రెండు సినిమాలో వచ్చే పాటలు మాత్రమే ఉన్నట్టు అంటున్నారు. అంతే కాకుండా, సినిమాలో చాలా మంది తమ సొంత వాయిస్ లో తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇది కూడా చాలా కొత్తగా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టీం అంతా కూడా, ఇప్పుడు యాక్టివ్ గా ప్రోమోస్, పోస్టర్స్, ఇంకొక ట్రైలర్ కూడా విడుదల చేయడం అనేది సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచే లాగా ఉంది. దాంతో సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

watch video :


End of Article

You may also like