ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కళ్యాణ్ దేవ్ పేరు వినపడుతోంది. కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడుగా మనందరికీ తెలుసు. చిరంజీవి కూతురు శ్రీజ ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కళ్యాణ్ దేవ్. అయితే కళ్యాణ్ దేవ్ శ్రీజ కి నవిష్క జన్మించిన విషయం మనకు తెలిసినదే. కానీ వీళ్ళిద్దరూ విడిపోయారని… ఈ మధ్యన ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

అయితే కళ్యాణ్ దేవ్ సినిమాలకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోవడంతో ఇది నిజమేనని అంతా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ నిజమే అన్నట్లు కళ్యాణ్ దేవ్ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

అయితే వీళ్ళిద్దరూ విడిపోయినట్లు కానీ విడాకులు తీసుకున్నట్లు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ శ్రీజ కూతురు నవిష్క కూడా శ్రీజ దగ్గరే ఉంది. వీళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి కూతురిని శ్రీజ దగ్గర మాత్రమే కాకుండా కళ్యాణ్ దేవ్ దగ్గర కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ దేవ్ తన కూతురు తో కలిసి ఒక వీడియోని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనేది చూస్తే..

నావిష్క నా గుండె….నా ఆత్మ… నా జీవితం లో నాకు వచ్చినది ఏదైనా గొప్ప విషయం వుంది అంటే అది నవిష్క ఏ అన్నారు. అలానే నా నవ్వుకు కారణం కూడా నా పాపే అన్నారు. ఆమెనే నా ప్రపంచమని.. తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలని చెప్పారు. అలానే క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నారు. లవ్ యు అని పోస్ట్ చేసారు. ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాను… చూసి చాలా రోజులవుతోంది అంటూ ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ దేవ్.