తెలుగులో ఒక క్రేజీ మల్టీ స్టారర్ కి శ్రీకారం….ఊహించని కాంబినేషన్…!

తెలుగులో ఒక క్రేజీ మల్టీ స్టారర్ కి శ్రీకారం….ఊహించని కాంబినేషన్…!

by Mounika Singaluri

తెలుగులో ఇప్పుడు మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది.పలు క్రేజీ కాంబినేషన్ లు తెర మీదకి వస్తున్నాయి.గతంలో వెంకటేష్ మహేష్ ఇద్దరు ఈ ట్రెండ్ ను తిరిగి ప్రారంభించారు.తర్వాత వరస పెట్టి మంచి మంచి కాంబినేషన్స్ తెర మీదకు వచ్చాయి.

Video Advertisement

అయితే ఇప్పుడు మరో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని తమిళ్, తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గా దయ అనే వెబ్ సిరీస్ తో మరోసారి పవన్ సాదినేని సత్తా చాటాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో ఈ ఇద్దరు హీరోలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా కొత్త కథలతో మూవీస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వీరిద్దరితో మూవీ అంటే కచ్చితంగా తెలుగు, తమిళ్ భాషలలో మంచి ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందనేది వేచి చూడాలి.


You may also like

Leave a Comment