“బాహుబలి” లెవెల్లో “బింబిసార”.. కళ్యాణ్ రామ్ ని ఇలా ఎప్పుడు చూసుండరు..!

“బాహుబలి” లెవెల్లో “బింబిసార”.. కళ్యాణ్ రామ్ ని ఇలా ఎప్పుడు చూసుండరు..!

by Anudeep

Ads

నందమూరి కల్యాణ రామ్ తెలుగువారికి సుపరిచితుడే. నిర్మాత కూడా కళ్యాణ్ రామ్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇటీవల కల్యాణ రామ్ కు సరైన హిట్స్ లేవు. అయితే.. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ పోస్టర్ చూస్తే మీకే అర్ధం అవుతుంది.

Video Advertisement

bimbisara

ఎన్టీఆర్ జయంతి సందర్భం గా “బింబిసార” టైటిల్ అండ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్నారు. పీరియాడిక్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యం ఉన్నదా..? లేక కాల్పనిక సోషియో ఫాంటసీ మూవీ నా అన్న సంగతి తేలాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్ చూస్తూనే బాహుబలి లెవెల్లో ఉన్నదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా వీర యోధుడి లా కనిపిస్తున్నాడు. “ఎంతమంచివాడవురా” సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నుంచి సినిమాలు రాలేదు. ఈ సినిమా పై నందమూరి ఫాన్స్ బాగానే ఆశలు పెట్టుకున్నారు.


End of Article

You may also like