Ads
కేన్ విలియమ్సన్ న్యూ జీలాండ్ లోనే కాదు అండి బాబు ! ఈయన్ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మరీ భారత్ లో ఇంకా ఎక్కువగానే అభిమానిస్తారు. ఇక తెలుగు క్రికెట్ అభిమానులతో కేన్ మామ కి ఉన్న అనుబంధం కొత్తగా చెప్పనవసరం లేదు ఆయన్ని రేలంగి మావయ్య గా పిలుచుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న భారత్ న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడగా భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Video Advertisement
మొదట బాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ జట్టుకి ఆరంభం లోనే భారత బౌలర్లు వికెట్లు తీసి న్యూజీలాండ్ మీద ఒత్తిడి ని పెంచారు. ఇంతలోనే భారత ఫీల్డర్లు క్యాచ్లని వదిలి పెద్ద తప్పే చేసారు. దీనితో మరింత ఒత్తిడిలో ఉన్న న్యూజిలాండ్ మొదట రన్ రేట్ తక్కువగానే కొనసాగించింది. మరో వికెట్ పడకుండా రచీన్ రవీంద్ర – మిచెల్ లు కీలక భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టుని మంచి స్కోర్ కి చేరేలా తమ వంతు కృషి చేసారు.
డ్రింక్స్ బ్రేక్ లో కేన్ విలియమ్సన్ సిరీస్ లో ఉన్న ఆటగాళ్లతో ఏమి మాట్లాడారో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో ధాటిగా ఆది వరుస బౌండరీలు సాధించి పరుగులని పిండుకున్నారు. ధర్మశాల పిచ్ పేస్ కి అనుకూలంగా, స్పిన్ బాటింగ్ కి అనుకూలంగా ఉందని తమ వ్యూహాలని మార్చి ధీటుగా ఆడాలని సూచనలు అందించాడు.
గాయం కారణంగా విలియమ్సన్ ఇప్పటికే జట్టు నుంచి దూరంగా కాగా మరిన్ని మ్యాచ్లు మిగిలిఉండటం ఇప్పటికే న్యూజీలాండ్ టేబుల్ టాపర్స్ గా కొనసాగడం ఆ జట్టు సెమిస్ చేరటం పెద్ద కష్టం కాకపోవచ్చు. అందుకే సెమిస్ తో పోరులో కేన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమయినా కేన్ విలియమ్సన్ తాను జట్టులో లేకున్నా కెప్టెన్సీ బాధ్యతలని చాల బాగా వ్యవహరిస్తున్నారు.
నిన్నటి న్యూ జీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపు పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ మరియు మీమ్స్ ఇవే !
Kane Williamson giving his inputs to Rachin Ravindra and Daryl Mitchell in the drinks break. pic.twitter.com/o9tJAAmgUH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023
End of Article