న్యూజిలాండ్ మెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మనందరికీ సుపరిచితుడే. బ్యాట్ పట్టుకుంటే బాదడమే కాదు ఓటమి ఎదురైనా నిగ్రహం గా ఎదుర్కోగల సమర్ధుడు మన కేన్ మామ. అతని నాయకత్వ పటిమ, టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టైం లో అతని నిలకడ ను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది.

kane and sarah

విలియమ్సన్ 303 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15,107 పరుగులు చేశాడు. రాస్ టేలర్ (17996) మరియు స్టీఫెన్ ఫ్లెమింగ్ (15289) తర్వాత అతను తన జట్టుకు అత్యధిక పరుగులు చేసిన మూడవవాడు గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 37 సెంచరీలు, 84 అర్ధ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించుకున్నాడు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు.. కేన్ ఎంత ఒత్తిడి లో అయినా ప్రశాంతత ను చూపించగలడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి సమయం లో కూడా కేన్ మామ తన ముఖం పై చిరునవ్వును చెరగనివ్వలేదు.

kane and sarah 2

అందుకే అతనికి ప్రపంచ వ్యాప్తం గా అభిమానులున్నారు. కేన్ విలియమ్సన్ కు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. తన భార్య సారా రహీం తో కలిసి జీవిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లోనే సారా పండంటి ఆడబిడ్డను ప్రసవించారు. కేన్ విలియమ్సన్ లానే, సారా కూడా సోషల్ మీడియా లో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. చాలా నిలకడ గా ఉంటారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ లో ఉంటుంది. ఆమెకి కేవలం 200 ల ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు.

kane williamson 1

అసలు వీరి లవ్ స్టోరీ నే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. సారా ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో జన్మించారు. ఆ తరువాత ఆమె న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయ్యారు. ఆమె నర్స్ గా పని చేసేవారు. తాను పని చేస్తున్న ఆసుపత్రికి ఓ సారి కేన్ విలియమ్సన్ చికిత్స కోసం వచ్చారు. ఆ సమయం లోనే వారిద్దరూ తోలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని, డేటింగ్ కూడా చేసారు.