ఒక భాషలో డబ్బింగ్… మూడు భాషల్లో రీమేక్..! సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా చూశారా..?

ఒక భాషలో డబ్బింగ్… మూడు భాషల్లో రీమేక్..! సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

సినిమా అన్న తర్వాత వేరే భాషల్లోకి రీమేక్ అవ్వడం సహజం. మన తెలుగు సినిమాలు ఇతర భాషలో రీమేక్ అయ్యాయి. అవుతూనే ఉంటాయి. అలాగే ఇతర భాషల సినిమాలు కూడా మన తెలుగులో రీమేక్ చేస్తూనే ఉంటారు. అయితే, ఈ సినిమా మాత్రం మూడు భాషల్లో రీమేక్ అయ్యింది. ఒరిజినల్ సినిమా కన్నడ భాషలో విడుదల అయ్యింది. తెలుగులో కూడా డబ్బింగ్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా పేరు దియా. 2020 లో వచ్చిన ఈ సినిమా, కన్నడలో విడుదల అయ్యి, సెన్సేషన్ సాధించాక, ఇదే పేరుతో తెలుగులో విడుదల చేశారు.

Video Advertisement

kannada movie which had three remakes

ఈ సినిమా తెలుగు వర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఖుషి రవి, పృథ్వి అంబార్, దీక్షిత్ శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇంక కథ విషయానికి వస్తే, దియా స్వరూప్ (ఖుషి రవి) సరదాగా ఉండే ఒక అమ్మాయి. దియా మొదట రోహిత్ (దీక్షిత్ శెట్టి) ని కాలేజ్ లో చూసి ప్రేమిస్తుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతారు. ఒక ప్రమాదంలో రోహిత్ చనిపోయాడు అని దియా అనుకుంటుంది. అప్పుడు దియాకి ఆది (పృథ్వి అంబార్) పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాని తెలుగులో డియర్ మేఘ పేరుతో రీమేక్ చేసి విడుదల చేశారు.

హిందీలో డియర్ దియా పేరుతో, మరాఠీలో సారీ పేరుతో విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఒక సినిమా మూడు భాషల్లో రీమేక్ అవ్వడం అనేది ఈ సినిమా విషయంలోనే జరిగింది. లాక్ డౌన్ సమయంలో ఇతర భాషల కంటెంట్ కూడా చూడడంతో, ఈ సినిమాకి ఇంకా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత దీక్షిత్ శెట్టి చాలా పాపులర్ అయ్యారు. ఇది దీక్షిత్ శెట్టి మొదటి సినిమా కూడా. తర్వాత తెలుగులో దసరా సినిమా కూడా చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఉంది. గత కొంత కాలంగా వచ్చిన ప్రేమ కథల్లో మంచి ప్రేమ కథగా ఈ సినిమా కూడా నిలిచింది.


End of Article

You may also like